యియ్యాల్టి రామాయనం – తత్తవం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అప్పన్న: నిన్న సెప్పిన తత్తవం నీకు ఏమైనా అద్దమైందా?

రాజన్న: ఏ తత్తవం

అప్పన్న: నీ యంకమ్మా ఏ తత్తవమా? అంటే నిన్ను ఆ పెస్న అడిగి తప్పు సేసా నాన్న మాట. నాతొ బాటూ పక్కనే కూసోని ఇన్నావ్ ఏ తత్తవం అని అడుగు తావా తత్తుకొడకా !

రాజన్న: ఏమని తిట్టావ్ మళ్ళీ తిట్టు

అప్పన్న:  తత్తుకొడకా

రాజన్న: ఇప్పుడు గురుతోచ్చింది.  తత్తు అంటే పెరమాత్మ అని సుందరకాండ మొదట్లో సెప్పారు గుర్తుందా?  అంటే నన్ను పెరమాత్మ కొడకా అని తిట్టావని అద్దం. మనం తిట్టుకొనే తిట్టులో కూడా తత్తవం ఉందన్న మాటా.

అప్పన్న: నువ్వు ఎక్కడికో ఎల్లి పోయావోరే. అసలు తత్తవం అంటే ఏంట్రా ?  నా బుర్రకి ఎక్కలేదు ఒక్క ముక్కా,   ఒక్కటి తప్ప. శివుడి కి ఇష్నువు కి తేడ  లేదని తెలిసిన కాన్నించి ఒక సెంక మనసు తోలిచేతంది.

రాజన్న: ఏంటా సెంక?

అప్పన్న: శివుడి బార్య పార్వతి ఇష్నువు బార్య లచిమి.  అప్పడు పార్వతి లచిమి కూడా ఒకటే కదా.

రాజన్న: ఒకటే. అంటే ఉన్న పెదాద్దం ఒక్కటే అన్నారుగాదా.

అప్పన్న: అంటే ఆ ఉన్న ఒక్క దేవుడూ ఇన్ని దేవుళ్ళుగా మారిపోయాడా?

రాజన్న: ఔను.

అప్పన్న: సరే తత్తవం అంటే ఏంటో సెప్పు.

రాజన్న: దొంగ లాగ దుంగ లాగ ఉన్నా దేవుడు ఒక్కడే అని. అన్నిట్లోనూ ఆ దేవుడే ఉన్నాడని, నీలో, నాలో, ఆ కోడిలో, ఈ మేకలో

అప్పన్న: దొంగ దొంగే దుంగ దున్గే కదా ఆల్లకీ దేవుడికీ లంకెడతావేటీ?.  నీకు అద్దమైతే సెప్పు లేదా తెల్దు అని సెప్పు ఇలా ఆయన సేప్పిందే సిలకలా సెప్పకు అది అద్దం అవలేదనేగా నిన్ను అడిగేది.

రాజన్న: ఎoట్రో కోప్మోచేసింది.  నాకు అంత వరకే తెల్సు.

అప్పన్న: సరే మనకి కదలు ఇంటాకి బావుంటై ఈ తత్తవాలు మనకెందుకూ దేవుడోకడే అని తెలుసుకుంటే సాలు ఆ గోపాలసామే నా దేవుడు. నేను నా దేవుణ్ణి మార్చక్కల్లేదు. మొన్న మా ఇంటిది ఇక్కన్నుంచి నేను షిరిడీ సాయి బాబాను మొక్కు కుంటానంటే నేను అదే సెప్పాను ఎర్రి మొగవా దేవుణ్ణి మార్చక్కల్లేదు అని. అదీ ఒప్పేసుకుంది.

రాజన్న : బాగుందిరా ఇంతే తెలుసుకుంటే సాలు మనబోటోల్లకి .

అప్పన్న: మా ఇంటిది పిత్త పరిగలట్రంమ్మంది  నే పోతన్నా ఆ పిత్త పరిగల్లో కూడా దేవుడున్నాడు అంటే ఇక కూడు మానేసి కూసోవాల.

రాజన్న: ఆగాగు ఒక ఇసయం సెప్పాల.

అప్పన్న: ఏంటది ?

రాజన్న: ఆ పిత్త పరిగల్లోనూ దేవుడున్నాడు నీలోను దేవుడున్నాడు అంటే నీలో దేవుడు ఆ పిత్తపరిగాల్లో దేవుణ్ణి తింటాడు అంతే! ఇదే తత్తవం.  కాబట్టి మనం ఎప్పుడ్లాగే బతకొచ్చు. పోయిరా.

అప్పన్న: దేవుణ్ణి దేవుడు తింట మేటీ.  నీ బొంద తత్తవం నీ కు అద్దం కాలేదని ఒప్పుకోవు!! సరే నేనొత్త.

* * *

Your views are valuable to us!