Like-o-Meter
[Total: 0 Average: 0]
కొత్తా రాష్ట్ర మండి, వినోదం చూసి పొండి
పేరు మారితే రూపు మారును పేదరికం ఇక తొలగి పోవును
కొత్త కుంపట్లో నీళ్ళు కాసినా నెయ్యగ వెంటనే మారి పోవును
చిత్రం చూడ రండి, ఇది భలే కొత్తా రాష్ట్రమండి
విడిపోయి కలసి ఉండడం, కలసి ఉండి విడిపోవడం
అన్నీ రెండుగా పంచుకోవడం ఉన్నది ఒకటి గ ఉండిపోవడం
భాష ఒక్కటే ఏసలు పెక్కులు ఒక్కో ఏసకు ఒక్కో రాష్ట్రం
రాష్ట్రం మొత్తం ముక్కల మయం, ముక్కలు కలిపితే పెరగదు స్థలం
అమ్మ నాన్న కోస్తాంధ్రా లో, పిల్లలు తెలంగాణలో
అత్తా మామా రాయల సీమలో, మనుమలు ఉత్తరాంధ్రలో
రాకపోకలు పెరిగి పోయినవి, అక్కడివిక్కడ ఇక్కడివక్కడ
ఎక్కడ పడితే అక్కడ దొరకును, దొరకిన కొద్దీ దూరం పెరుగును
పక్క ఫ్లాట్ లో చావు తెలియదు పుట్టుక తెలియదు
ఒక్క రాష్ట్రమైతేనేం ముక్కలుగా చీలితేనేం
సంకుచితత్వం రౌతుగ గుర్రం జీవన రధాన్ని లాగితే
చేరే గమ్యం అజ్ఞానపు అంధకార సదనం