“నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో…ఓం నమో నమో నటరాజా నమోనమో నటతేజా” అని వీర బోల్డు పేరిణీ తాండవమైపోతున్నా. హెందుకో తెలీదుగానీ ఎల్లుండామధ్యన్నుంచీ డాన్సు చేసేసెయ్యాలనిపిచ్చేస్తోంది ఫాపం.
ఎడంకాలు నిలబెట్టేసి కుడికాలు పైకెత్తేసేసి ఎడం చెయ్యి పైకి కుడిచెయ్యి పెట్టేసేసి బాలెన్సు కుదరకపోయినా “నమో నమో నటరాజ నమో…” అని వూగిపోతున్న నన్ను చూసిన బాబాయ్ పుసుక్కున నవ్వాడు. పుసుక్కు నవ్వంటే నాకు తెగబోల్డు ఛిరాకు. అందుజేసి నాక్కోపమొచ్చేసేసింది. “బాబాయ్…” అని అరిచాను. “పోవోయ్…” అన్నాడు బాబాయ్. తిరుగుబాటన్నా కూడా నాకు చిరాకున్నర పుట్టేస్తుంది. “బాబాయ్…” అని మళ్ళీ అరిచాను. ఈసారి బాబాయ్ ఝుడుసుకొన్నాడో హేమో మాట్లాడ్లేదు. నా నటరాజ భంగిమను చాలించి బాబాయ్ వైపుకు కదిలాను. బెదిరిపోయిన బాబాయ్ రెండడుగులు ముందుకేసి నా గుండు మీద ఓ జెల్లకాయ కొట్టాడు. ఫోనీలే ఫాపం బోల్డు మహా కన్ఫూజనులో కౌగిలించబోయి జెల్ల కొఠీసేడని అనుకొనేసాను.
“బాబాయ్…నీకే గనక ధైర్యముంటే ఆ పాట పాడి డాన్సు చెయ్” అని సవాలేసాను. అందుకు బాబాయ్ పుచ్చకాయలా మొహం పెట్టి “అరె పిచ్చోడా! పాడ్డానికి గొంతు కావాల్రా…ధైర్నం కాదు” అన్నాడు నా గుండున్నిముర్తు. చెప్పొద్దూ నాకు లంకంత ఖోపమొచ్చేసింది. తాటకంత విసుగు కూడా విజృంభించేసింది. “బాబాయ్….కమాన్…డాన్స్….పాడు” అన్నాన్నేను. ఈసారి నా గుండు పైన నేనే జెల్ల వేసుకొన్నా. ఆ జెల్ల చప్పుడికి బాబాయ్ గుండె బెదిరిపోయింది గామోసు పాటెత్తుకున్నాడు.
“న మో న మో…గుజరాత న మో…న మో..పీయెం క్యాండేటా…న మో న మో మహరాజా న మో న మో మహామంత్రా”
అబద్ధానికైనా నిజం చెప్పాలి కదా! నాకు కుతుబ్మినారంత ఖోపం చార్మినారంత చెమటా వొచ్చేసేసాయి ఆ పాటకి. “శారదా…” అని కేకేసాను. బాబాయ్ పాటాపేసి “ఏదిరా ఆ శారదా?” అన్నాడు.
“నువ్వే ఆ శారదా…నేనే నీ శంకరశాస్త్రిని. నే పాడమన్నదేమిటి? నువ్వు పాడుతున్నదేమిటి? నా గుండు మీద కర్పూరం వెలిగించాలని చూస్తున్నావా?” అని హుంకరించాను. అందుకు బాబాయ్ “వొరేయ్! నైంటీన్ ఎయిటీస్ శంకరశాస్త్రీ ఇది ఇది ట్వంటీ థర్టీన్స్ రా. ఇప్పుడు నమో కు అర్థం మారిపోయింది!” అన్నాడు.
నా వెర్రాచ్చర్యం వొచ్చేసింది. గాంధీగారి మూడుకోతులూ నా మొహం మీద కిచకిచా నవ్వేసేసాయి. నా భాధల్ని చూసేసిన బాబాయ్‍కి గుండు….సారీ….గుండె కరిగిపోయింది “నా ముద్దుల శంకలశాస్తీ….గుజరాతునుద్ధరించేసి యిహ రేపో మాపో మన యిండియానే ఎత్తి కుదేసేస్తాడని చెప్పేస్తున్న నరేంద్ర మోడినే మా నమో నమో.” అంటూ మళ్లీ గుండు మీద జెల్లకొట్టాడు.
నేను యమ వీర బోల్డు యిదైపోయేసి నిల్చున్నానా బాబాయ్ మళ్ళీ అందు కొన్నాడు “న మో న మో…గుజరాత న మో…భళా..పీయెం క్యాండేటా…న మో న మో మహరాజా న మో న మో మహామంత్రా”
@॑@@@@