నయా మ్యూజింగ్స్ – ప్రచారప్పాద్యతలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

“బాబాయ్! నీ ప్రచారప్పాద్యతలు నాకీయ్” అనేసాన్నేను టక్కు టక్కున. “ఏంటీ? నాకి…యియ్యాలా! ఛీ భడవా!” అన్నాడు బాబాయి. చాల బోల్డు తెగ పెద్దోణ్ణైపోయాను కాబట్టి నన్ను భడవా అనకూడదని బాబాయికి ఎల్లుండాప్పొద్దున్నే చెప్పినా ఈవేళ్టికా మాటననేసాడు. నాకు నిజ్జంగా మహా ఖోపాగ్ని తన్నుకొచ్చింది కానీ తమాయించేసుకొన్నా. మా పెద్దగొప్పోణ్ణైన నాకు, రెండూన్నర సెం.మీలు పెరిగి పోయినేటిక్కుట్టిచ్చిన లాగూలు పొట్టై పోయిన నాకు, నాన్నారులాంటోళ్ళే హడ్డలిపోయి “చిట్టెధవా” అని గౌరవం చూపించుకొనే నాకు…..ఆగు….ఛీ ఏమిటీ ’నాకు’లు!

బోల్డు చిరాకాచ్చర్యాలొచ్చేసాయి నాకు. మళ్ళీ ’నాకు’….యాక్!

“బాబాయ్ నీ ప్రచారప్పాద్యతలు నేను కిచ్చేయ్” అన్నాన్నేను. “ఏంటీ? నేనుకిచ్చేయ్? పేనుకెవడైనా పెత్తనాలిస్తాడట్రా! చల్ హట్” అనేసాడు బాబాయ్. నా టోపేరం లేచిపోయింది. చాలా లావు కడివెడంత మహా కోపాత్మణ్ణైపోయాను. “పేను కాదు నేను….నేనంటే నేనే” అన్నాన్నేను గాట్టిగా.

బాబాయ్ చటక్కున తలెత్తి చూసేసాడు. నేనప్పటికే నటరాజ భంగిమలోకి వెళ్ళిపోయాను. బేలన్సు దొరక్క వూగేస్తుంటే బాబాయ్ హడ్డలి పొయేసాడు. “నమో నమో నటరాజ నమో…” అని బాబాయి పాడేసి మొక్కేస్తాడేమోనని నేను మహా పెద్ద యిదైపోయాను కానీ హడ్డలిపోయిన బాబాయ్ మరింకేమీ మాట్లాడకుండా ఆ పక్కనే వున్న కూజాలోని నీళ్ళెత్తి గుమ్మరించేసాడు. “నువ్వేమన్నా మోడీ నరేంద్రుడనుకొన్నావా ఏవిటీ? చల్ హట్” అని చక్కాపోయేసాడు బాబాయ్.

ఇక నేను మళ్ళెప్పుడూ బాబాయ్ కి ప్రచారం చెయ్యదల్చుకోలేదు. రేపాపొద్దున్నే యెనకింట్లో దిగిన నాలుక్కళ్ళ సీతక్కూడా!

 

Your views are valuable to us!