లైట్స్ ఆన్!
కేమెరా!!
ఏక్షన్!!!
(వైట్ హౌస్)
ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్
ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్
ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్. మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్!
ఒబామా: అలాగా, సరే, థాంక్స్.
మళ్ళీ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్
ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్
ఫోనులో ఆడ గొంతు: హలో యా! హవ్ ఆర్ యూ యా! దిస్ ఇస్ హిల్లరీ యా!
ఒబామా: వాట్ హేపెండ్ టూ యో లేడీ? వై ఆం ఐ హియరింగన్ ఏక్సెంట్?
హిల్లరీ: ఐ “యాం” “యిన్” “యిండియా” యా. ఎండ్ ఐ లైక్ యిండియన్ యాక్సెంట్ యూ నో
ఒబామా: అమ్మా! తల్లీ! ఇండియన్ ఏక్సెంట్ మాట్లాడింది చాలు గానీ విషయం చెప్పు!
హిల్లరీ: ఇప్పుడే అఫ్ఘాన్ రిపోర్టు వచ్చింది. పరిస్థితి బాలేదు.
ఒబామా: తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు టెర్రరిస్టులకి ఫండింగ్ ఎలా వస్తోందో?
హిల్లరీ: అలసు లేమేన్ చేతో వామూ చేతో మనమే ఫండింగ్ చేయించాల్సింది. ఈపాటికి చచ్చూరుకునేవాళ్ళు.
ఒబామా: నేరం నాది కాదు. జార్జ్ బుష్ ది!
హిల్లరీ: సరే! ఇప్పుడేం చేద్దాం?
ఒబామా: ఏముందీ? స్ట్రేటజీ మార్చాలి. కొత్త పధ్ధతులు ట్రై చెయ్యాలి.
హిల్లరీ: కొత్తవాటికన్నా పాతవే బెటర్ ఏమో?
ఒబామా: అంటే?
హిల్లరీ: ఇది వరకూ సక్సెస్ అయిన ఫార్మ్యూలాలు ఉపయోగించచ్చు కదా?
ఒబామా: అర్థం కాలేదు.
హిల్లరీ: నీకోపట్టాన అర్థం కాదని నాకు తెలుసు గానీ, నేననేది పాత కాలం నాటి యుధ్ధ నీతులు ఉపయోగించచ్చు కదా అని
ఒబామా: గుడ్ అయిడియా. సివిల్ వార్ నీతులు ఉపయోగిద్దామా?
హిల్లరీ: నీ యెంక్ .. వద్దులే బూతులొస్తున్నాయి – నేను మాట్లాడేది వేలకు వేల ఏళ్ళ క్రితం యుధ్ధాల గురించి
ఒబామా: సరే ఇండియాలోనే ఉన్నావు కదా – రామాయణ మహాభారతాలు తీసుకురా
హిల్లరీ: నాయనా, బాబూ తండ్రీ – ఇది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు.
ఒబామా: మరి?
హిల్లరీ: డా|| బ్రౌన్ తో మాట్లాడి టైం మెషీన్ తెప్పించుకో. అది తీసుకుని భారతం టైం కి వెళ్ళి ట్రిక్కులన్నీ నేర్చుకుని రా!
ఒబామా: ఇదేదో బాగానే ఉందే? నేనొక్కడినే వెళ్తే మరి కల్చర్ గేప్ ఉంటుంది కదా?
హిల్లరీ: అదీ నిజమే. ఇక్కడ అమర్ కింగ్ అని ఒక పెద్ద నెగోషియేటర్ ఉన్నాడు. నాకు మాంచి ఫ్రెండ్. తోడు తీసుకెళ్ళు.
ఒబామా: మరి అతనికి యుద్ధం, డిఫెన్స్ గురించి తెలుసా?
హిల్లరీ: అసలు తెలియదు. కానీ పనులు చక్కబెట్టుకొస్తాడు. డిఫెన్స్ కోసం అయితే కేకే ఏంథోనీ ని కూడా తీసుకెళ్ళు. అలాగే కాస్త వినోదం కోసం ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని కూడా తీసుకెళ్ళు.
ఒబామా: అలాగే – థేంక్యూ!! ఇప్పుడే ఈ-మెయిల్ పంపిస్తున్నా
(కంప్యూటర్ బూట్ చెయ్యడానికి ప్రయత్నించి)
ఒబామా: వాట్ ద హెక్? సప్పోర్ట్ లైన్ కి కాల్ చేస్తా (డయల్ చేస్తున్న చప్పుడు) ఫోన్ లో కంఠం: “మీరు డయల్ చేసిన నెంబరు మరియొకసారి సరిచూసుకొండి! ప్లీస్ చెక్ ద నంబర్ యూ హావ్ డయల్డ్! ఒబామా: ఓరినీ! నా టెక్ సపోర్ట్ కూడా అవుట్సోర్స్ అయ్యిందా? రామ రామ!తప్పు తప్పు .. జీసస్ జీసస్!! (మళ్ళీ డయల్ చేస్తున్న చప్పుడు) ఫోన్ లో కంఠం: టెక్ సపోర్ట్ – మై నేం ఈస్ రాక్ మేన్ ! హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒబామా: (కాసంత చిరాగ్గా) ఏమిటి నీ పేరు రాక్ మేనా? క్రేక్ మేన్ ఏమి కాదూ? నువ్వు ఇండియాలో ఉన్నావని తెలుసుగాని అసలు పేరు చెప్పి చావు. ఫోన్ లో కంఠం: బండయ్యండి. అయ్యగారు టీ తాగడానికెళ్ళి నన్ను కూకోబెట్టారండి. ఒబామా: ఖర్మ. ఈ స్లండాగ్ సినిమా తీసినవాడిని షూట్ చెయ్యాలి!! : ఏటనీసినారేటి? ఏటేటో తెలీకుండా అనీసినారు. రేతిరసలే వన్నం మందు కొట్టీసి సెట్టు కింద తొంగున్న – ఇప్పటికీ పిచ్చిపిచ్చిగా ఉన్నాది. ఒబామా: ఏమి అనలేదు గాని – నా కంప్యూటర్ బూట్ అవ్వట్లేదు -ఏమి చెయ్యాలో చెప్తావా? బండయ్య: ఏటవ్వట్లేదూ? ఒబామా: బూట్ ! బూట్!! అదే ఆన్ అవ్వట్లేదు బండయ్య: ఓస్ ఇంతేనా! ఆన్ ఆఫ్ ‘ సిచ్చి ‘ నొక్కీసి ఆన్ సెయ్యండీ! (టిక్ క్లిక్ ) ఒబామా: వావ్ యూ ఆర్ ఎ జీనియస్. ఆన్ అయ్యింది. కానీ ఇప్పుడూ ప్రింటర్ పని చెయ్యట్లేదే? అసలే విండోస్ విస్తా నాది. బండయ్య: మీరేటంటున్నారో నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఇక్కడ ఏది పని చెయ్యకపోయిన ఆఫ్ సేసి ఆన్ చేసీస్తారు కదేటి? పోయినవన్నీ బేగి యెల్లిపొచ్చీస్తాయ్. (టిక్ క్లిక్ ) ఒబామా: వావ్ – పని చేస్తోంది – థేంక్యూ థేంక్యూ బాయ్ – హమ్మయా ఈ మెయిల్ వెళ్ళిపోయింది! *****
రచయిత: ఏంటప్పుడే నిట్టూర్పు విడిచేస్తున్నారు? చదివినోళ్ళు: అంటే! ఇంకా ఉందా?? రచయిత: ఆయ్..ఉందండీ..పార్ట్ – 2 చదివినోళ్ళు: *#@$ |