ఒబామా: అందరూ బెల్టులు కట్టుకోండి, యుగం మారుతున్నాం . కాస్త కుదుపులుండవచ్చు
అందరూ: సరే సరే!!!!
అమర్: అరే! ఈ కుక్క ఎవరిది?
అక్బర్: నాదే! నా తిండి తిని, నా పొరుగురాజ్యం వాడిపట్ల విశ్వాసంగా ఉంటుంది. నామీదే మొరుగుడు పైగా! అందుకే మహాభారత కాలంలో ఏకలవ్యుడి దగ్గర వదిలేద్దామని వచ్చా.
అమర్: అయ్యా! ఇలాంటివాళ్ళు మా కాలంలో కూడా ఉన్నారు – మేము వాళ్ళని కాకామ్యూనిష్టులని పిలుస్తాం.
అక్బర్: ఓహో!!!
ఒబామా: సరే – భారతం వచ్చేసింది .. దిగండి
(అందరూ దిగాక)
రెహ్మాన్: ఏదో తేడాగా ఉంది .. సంథింగ్ రాంగ్!
ఒబామా: యుగం మారింది కదా … జెట్ లేగ్ అయ్యుంటుంది!
రెహ్మాన్: కాదు కాదు .. ఏదో తేడాగా ఉంది .. సరే సరే పదండి
ఆంథోనీ: (పక్కన పడుకున్న ఒకతన్ని చూసి) ఈయనెవరండీ బాబూ, మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నాడు, కుంభకర్ణుడిలాగా?
దారిన పోయే దానయ్య: స్వామీ, ఆయన కుంభకర్ణుడే!!!
రెహ్మాన్: సంథింగ్ రాంగ్!
అమర్: భజరంగ్ దళ్ ! భజరంగ్ దళ్ !
ఆంథోనీ: భజరంగ్ దళ్ కాదు… అవి కోతులు! వానర సైన్యం లా ఉంది …
రెహ్మాన్: ఇప్పుడు అర్ధం అయ్యింది … ఒబామా గారూ, మనం పొరపాటున త్రేతాయుగానికొచ్చేశాం. ఇది రామాయణ కాలం, భారతం కాదు.
ఒబామా: అవునా! అయ్యో .. సరే ఎలాగూ వచ్చాం కదా .. రాములవారిని చూసి పోదాం
ఆంథోనీ (అమర్ చెవిలో): ఏమండీ అమర్ కింగ్ గారూ! మీకో చిన్న మాట
అమర్: ఏంటీ? నువ్వు కూడా ఆ తెలుగు గంగాధర్ మిమిక్రీ విన్నావా? తిన్నగా విషయం చెప్పి చావు
ఆంథోనీ: అదేనండీ, ఇప్పుడు రాములవారున్నారని తేలితే మన యూ.పీ.ఏ పార్ట్^నర్ కరుణానిధి మొహం ఎక్కడ పెట్టుకోవాలి?
అమర్: నిజమే! వీళ్ళని అసలు రాములవారి వైపు వెళ్ళనివ్వకూడదు
(ఒబామా తో)
ఒబామా గారూ, ఒక్క విషయం. మరి కొన్ని రోజుల్లో యుద్ధం జరగబోతోంది. రాముల వారిని కలిసే అవకాశం మనకి రాదు. దాని బదులు ఆయన స్నేహితుడు సుగ్రీవుడిని కలుద్దాం
ఒబామా: సుగ్రీవుడినెందుకబ్బా?
అమర్: (ఒబామ చెవిలో కిచ కిచ కిచ కిచ)
ఒబామా: వండర్ఫుల్ వండర్ఫుల్ .. హిల్లరీ చెబితే ఏమో అనుకున్నా గానీ, మీరు అసాధ్యులే
(అందరూ సుగ్రీవుడి దగ్గరకెడతారు)
సుగ్రీవుడు: రండి రండి కలియుగ వాసులారా – మీ అద్భుతమైన సమయ విమానము గూర్చి వింటిని. సీతమ్మతల్లిని రావణుడి చెరనుండి విడిపించిన పిదప దానిని చూడవలెనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది
అమర్: సుగ్రీవులవారికి నమస్సులు. యుద్ధము ఎప్పుడు మొదలగునో చెప్పగలరా?
సుగ్రీవుడు: ఇంకా వారధి తయారగుచున్నది కదా!
అమర్: మేము కూడా రామ భక్తులమే స్వామీ!
అంథోని (అమర్ చెవిలో): ఆ మాట బీ జే పీ వాళ్ళూ వినారంటే చంపేస్తారు నిన్ను!
అమర్: ఇష్ష్ ఇష్ష్
(సుగ్రీవునితో)
సుగ్రీవా! మేము కూడా రామ భక్తులమే. ఆ రామ సేతు వారధి కాంట్రాక్టు మాకు అప్పగిస్తే అయొధ్య బాబ్రీ మసీదు స్థానంలో గుడి బీ.జే.పీ వారికన్నా ముందు మేమే కట్టీస్తాం – కదండీ ఒబామా గారూ?
అక్బర్: ఏమిటీ? మా తాతగారి మసీదు స్థానంలోనా? నేనొప్పుకోను
అమర్: ఎక్కువ మాట్లాడకు, నీ కుక్కని మళ్ళీ వెనక్కి నీతోనే పంపిస్తా!
అక్బర్: ఒద్దొద్దు బాబోయ్!
సుగ్రీవుడు: మీ మాటలు నాకు అవగతమగుటలేదు
అమర్: ఏమీ లేదు రాజా. మీరు వారధి కట్టే పనిని (ఒబా)మాకు అప్పగించండి. మేము కలియుగ కార్మికులని తీసుకు వచ్చి పని పూర్తిచేసెదము.
ఆంథోని: మధ్యలో ఒబామా లింక్ ఏమిటి?
అమర్: మనమే డిరెక్టుగా తీసుకుంటే మొత్తం మింగేది రూలింగ్ పార్టీ వాళ్ళే. ఒబామా అయితే బ్రిడ్జ్ అమేరికన్ టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ మనకి .. అర్థమయ్యిందా
సుగ్రీవుడు: మీకది సాధ్యమేనా?
అమర్: సాధ్యమే ప్రభూ
(బేక్ గ్రౌండ్ లో పాట – మన వాళ్ళ dance)
అన్ హోనీ కో హోనీ కర్దే (
హోని కో అన్ హోని
ఏక్ జగహ్ జబ్ జమా హో తీనో (
అమర్ అక్బర్ ఏంథోనీ
అమర్ అక్బర్ ఏంథోనీ )
ఆంథోని: అమర్ గారూ, మరి అందులో ఇసక ఎంత కలపాలి?
అమర్: దాని గురించి గట్టిగా మాట్లాడొద్దు!
సుగ్రీవుడు: నాకు వినబడినది. పవిత్రమైన రామ సేతువును మట్టితో నిర్మించెదరా? ఎంత అపచారము! మర్యాదగా మీకాలానికి పోవుడు, లేనిచో కఠినంగా శిక్షించెదము.
అమర్: ఆంథోనీ, మొత్తం చెడగొట్టావు కదా … ఇంక పద ..
(అందరూ మళ్ళీ టైం మేషీన్ లో)