ఓదార్పు యాత్ర వర్షన్ 2

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author.

“హల్లో ఆల్! నేను మీ ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి.  వైయెస్సార్ కాంగ్ కీలకనేత అంబటి రాంబాబు గారు టీవీ జీరో ప్రేక్షకుల కోసమనే ఒక ప్రకటన విడుదల చెయ్యాలని ఉబలాటపడుతున్నారు. లేటజ్ గో ఓవర్ టు రాంబాబు గారు. ఆ(…హల్లో రాంబాబు గారూ ఇప్పుడు మీరు ఆన్ లైన్ వున్నారు. మీరు చెప్పదల్చుకొన్నది మా ప్రేక్షకులకు నేరుగా చెప్పగలరు!”

 
 
“చాలా థాంక్స్ ఉల్లి వెంకట్! మెజార్టీ ప్రజల కోరిక మేరకు జగన్ బాబు మరోసారి ఓదార్పు యాత్రను చేబట్టబోతున్నారు. ఈ పర్యటనకు “ఓదార్పు యాత్ర వర్షన్ 2” అని నామకరణం చేశాం.
 
 
ఈ వర్షన్ 2 లో జగన్ బాబు ఈ క్రింది ప్ర్రాంతాల్లో పర్యటించి ప్రజల్ని ఓదారుస్తారు:
 
 
  • April 6 – April 10     శ్రీలంక
  • April 12 – April 15   పాకిస్తాన్
  • April 17-April 18     ఆస్ట్రేలియా
  • April 20-April 21     వెస్టిండీస్
 
 
పై ప్రాంతాల్లోని అభిమానులు, సానుభూతిపరులు విరివిగా పాల్గొని ఓదార్చుకోబడాలని మా కోరిక. రాజువయ్యా..మహరాజువయ్యా!!”

“రాంబాబు గారు! వైయెస్సార్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. మీరు చెప్పిన ప్రాంతాలేమో పరాయి దేశాల్లా ఉన్నాయి. ఎక్కడో ఏదో పొరబాటు జరిగినట్టు అనిపిస్తోంది. మీరు చదివిన ప్రాంతాలు కరెక్టేనా?”
 
 
“ఉల్లి గారు! మాకేం మతులు పోలేదు. దేముని దయవల్ల మెదడు ఉండాల్సిన చోటే ఉంది. నేను చదివిన ప్రాంతాల పేర్లు నూటికి నూరు శాతం కరెక్టే. ఎక్కడ బాధితులుంటారో అక్కడ జగన్ ఉంటారు. ఎక్కడ జగన్ వెళ్తారో అక్కడ ఓదార్పు ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా మా వెంటనే వున్న మీ ప్రేక్షకుల్లో మెజార్టీ జనాలకు అర్థమైవుంటుందిలేండి.”
 
 
“అఫ్ కోర్స్ ! పబ్లిక్ సబ్ జాన్తీ హై. కానీ ఆ ప్రాంతాలవాళ్ళకి జగనెవరో తెలీదు కదా! యాత్రను ఎలా కండక్ట్ చేస్తారు? ఎలా సక్సెస్ చేస్తారు?”
 
 
“ఆంధ్రాలోని వాళ్ళకే జగన్ బాబు గురించి సరిగ్గా తెలీదు. నేను చెప్పిన ప్రాంతాల్లోని వాళ్ళకి ఓదార్పు యాత్ర గురించి బాగా తెల్సు.”
 
“ఓకే రాంబాబు గారు! మీరు చెబుతున్నదేమిటో బొత్తిగా అర్థం కావడంలేదు. ఐనా మీ ప్రకటన మా ప్రేక్షకులకే కాబట్టి, వాళ్ళకి అర్థమౌతుందన్న నమ్మకం మీకుంది కాబట్టి ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.”
 
 
“రాజువయ్యా…ఓదార్పు రాజువయ్యా”
 
“బహుశా అది వైయెస్సార్ కాంగీయుల “జై హింద్” కు ప్రత్యామ్నాయ స్లోగన్ కాబోలు. సో టీవీ జీరో ప్రేక్షకులారా అదీ విషయం. జగన్ గారు తమ వర్షన్ 2 ఓదార్పు యాత్రలో భాగంగా శ్రీలంక, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మొదలైన ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్ని ఓదారుస్తారు. ఇంతటితో ఈ ప్రత్యేక ప్రసారం సమాప్తం. మరి కొద్దిసేపట్లో గుంతలకిడి – మాంచి కిక్కులుండే ఫాక్షన్ గేమ్ వస్తోంది. చూస్తూవుండండి టీవీ జీరో”.
 
{jcomments on}
 
 
 
 

 

Your views are valuable to us!