జీవుల పూర్వ జన్మ వృత్తాంతం ఒక విలేఖరికి తెలిస్తే !!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నీ అమ్మ కడుపున చెడబుట్టావు కదరా చూడు నీ బతుకు ఇలా ఈ మానులా !!
 
ఓసి నీ కామం కాలిపోనూ సినిమా తారగా ఎలిగిపోయి ఇలా కుక్క గా పుట్టావా 
చూడు వావి వరుసా లేకుండా నీ బతుకు !!
 
ఓరినీ జిమ్మడ నీ వ్యభిచార బుద్ది పోనిచ్చుకున్నావు కాదు పంది గా  పుట్టి కూడా !!
 
అంతటి మంచి కుటుంబంలో పుట్టి న నీకు ఇలా నా పాలేరులా జన్మను ఎత్తావా ?
పోయిన సారి దేశ ప్రధానివి ఇలా బండలా మారిపోయావా !
 
అరె నీవు పదవి లేని రాణివి ఇప్పుడిలా రాయిలా మారావా !
 
ఓసి నీ అసాధ్యం! మంత్రిగా ఎన్ని ఏళ్ళు ఏలావు నువ్వు ఇలా మార్జాలంగా మారావా!
 
నువ్వా ఇక్కడే కదా నువ్వు జల్సాగా గడిపావు దేశ అత్యున్నత స్థానం లో ఇలా తొండ లా ఇక్కడే చెట్లపై బతుకుతున్నావా !!
 
ఏమాశ్చర్యం! బుద్ధి గడ్డితిన్న నువ్వు పార్లమెంటు ను పట్టుకొని ఇంకా వదల లేదా ఇలా పోలీసు కుక్కలా మారి !
 
గొప్ప ఇంట్లో పుట్టి అన్ని పాపాలు చేసి అర్ధంతరంగా చచ్చిన నువ్వు ఇలా కుష్టురోగి గా మారావా ?
 
ఎందరి జీవితాలతో ఆడుకున్నవో నీ అవినీతి తీర్పులతో అందుకుతగ్గ దే నీ  ఈ గాడిద జన్మ బుద్దిగా ఉండు ఇప్పుడైనా !!
 
ఒక ప్రధాన ప్రుభుత్వ అధికారిగా చక్రం తిప్పావు కదరా ఇప్పుడు ఇలా గజ్జి కుక్కలా చక్కర్లు కొడుతున్నావా !!
 
దేశాన్ని దోచేసావు కదరా ఈ దీపం  పురుగులా ఎన్ని సార్లు పుట్టి చావాలో నీకు!!
 
ఎలాంటి వాడివి ఏమి దర్బారు, ఏమి భక్త గణం నీకు మహా జ్ఞానిగా మసలి ఇలా ముసలి గా మారావా!
 
అదిగో అక్కడ కోయబడుతున్న కోడె ఒకప్పటి పెద్ద వ్యాపార వేత్త.  వాడు తిరగని దేశం లేదు అనుభవించని సుఖం లేదు!! ఛీ వీడి బతుకు!!
 
 
 

Your views are valuable to us!