This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. |
ఢామ్మని పేలింది….రావణాసురుడి కడుపులోని టపాకాయ.
రామలీలా మైదానంకు కూతవేటు దూరంలో ఓ ఇంట్లో కూర్చొని రహస్య మంతనాలు చేస్తున్న సోనియా ఉలిక్కిపడి “మిస్టర్ మన్మోహన్! ఆ షబ్దము హేమ్టి? బాంబ్ బ్లాస్ట్!!” అని అడిగింది.
మన్మోహన్ గడ్డం గోక్కుంటూ, గుసగుసగా “డియర్ మేడమ్! రామ్ లీలా లోని రావణాసురుడి కడుపులో పెట్టిన టపాకాయ సౌండు” అన్నాడు.
“వ్వాట్! క్రాకర్…ఇన్ ద స్టమక్ ఆఫ్ అ పర్సన్? వాటి ఛీడాంబ్రమ్ డూయింగ్?”
“నో మేడమ్! ఇది తీవ్రవాదుల చర్య కాదు. దసరా పండుగ వేడుక. జస్ట్ ఫర్ ఫన్!”
“ఓహో! అది ఫన్ కోసమా!” అని హటాత్తుగా ముందుకు వంగి “కడుపులో టపాసు పెట్టి కాల్చడం ఫన్ ఐతే, మీ డేష ప్రజలు తీవ్రవాదులు పేల్చే బాంబుల్కి హెందుకు హంత గలాట్ట చేస్తారు?” అని అంది సోనియా.
తత్తరపడిన మన్మోహన్, టర్బన్ సరిచేసుకొంటూ “మేడమ్! రావణాసురుడికీ, తీవ్రవాదులకీ కొంచెం బేసిక్ డిఫరెన్స్ ఉంది.”
“వాట్స్ దట్?”
“సీ మేడమ్! రావణాసుర్ హిందువు. తీవ్రవాదులు హిందువులు కారు.” – తను చాలా తెలివిగా సమాధానమిచ్చినట్టు అనుకొన్నాడు మన్మోహన్.
“ఓ ఐ సీ! హిందూస్ డోంట్ మైండ్ హిందూ టెరరిస్ట్. హలాగైతే వై డోంట్ వుయ్ కాల్ బ్యాక్ జగ్దీష్ టైట్లర్? హీ టూ అ హిందు. మా అత్తఘారు పోయినప్డు టైట్లర్ డిడ్ అ ట్రెమండస్ జాబ్! బాంబే, ఢిల్లీ బాంబు బ్లాస్టుల్లో పోయిన మన పరువును నిలబెట్టగల ఒఖేఒక్ఖ మగాడు టైట్లరేనని నా ఫీలింగ్! వాడ్డూ యూ సే!”
మన్మోహన్ మొహంలో నెత్తురింకిపోయింది.
* * * * *