గీత గోవిందం – ఫ్రధమ సర్గము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

చతుర్థ అష్టపది – ఆడియో (Audio track of4th Ashtapadi)

images/stories/ashtapadi/09 Asta4 Panthuvarali.mp3

శ్లో. అనేక నారీ పరిరంభ సంభ్రమ
 స్పురణ్మనోహారి విలాస లాలసం
 మురారిమారా దుపదర్శయంత్యసౌ
 సఖీ సమక్షం పునరాహ రాధికాం

అనేక నారీమణుల ఆలింగన సంభ్రమంతో, శృంగార చేష్టలతో తేలియాడుతున్న మురారిని చెలికత్తె సమీపంగా చూపుతూ రాధికతో మళ్ళీ ఇట్లా అంటున్నది.

అష్టపది 4


  • సామోద దామోదర భ్రమరపరం రామక్రియా రాగ యతి తాళాభ్యాం గీయతే – రామక్రియ రాగం, యతి తాళం

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ
కేలి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరె     (ధృవం)

పీన పయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం
గోప వధూరనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగం

కాపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజం

కాపి కపోల తలే మిలితా లపితుం కిమపి శ్రుతి మూలే

చారు చుచుంబ నితంబవతీ దయితం పులకై రనుకూలే్

కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునాజల కూలే
మంజుల వంజుల కుంజ గతం విచకర్ష కరేణ దుకూలే

కర తల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే
రాసరసే సహ నృత్య పరా హరిణ యువతీ ప్రశసంసే

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారు తరామపరామనుగచ్చతి వామాం

శ్రీ జయదేవ భణితమిద మద్భుత కేశవకేళి రహస్యం
బృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యం

ఓ రాధా! చందనము అలరిన నీల శరీరమున పీతాంబరము ధరించినవాడు, తులసిమాలతో విరాజిల్లుతున్న చెవులలోని మణికుండలాలు రెండు చెక్కిళ్ళపై క్రీడా సమయంలో కదులుతూ వుండగా చిరునవ్వు గలిగి ముగ్ధమైన వధువులతో శ్రీ కృష్ణుడు విలాసంగా వున్నాడు.

Krishna Raasa Leela

రాధా! ఒక గోప వధువు తన బరువైన పయోధరములతో హరిని ప్రేమతో ఆలింగనం చేసికొని పంచమస్వరంలో స్వామితో కలసి గానం చేస్తున్నది.

రాధా! అదిగో! ఓక ముగ్ధయైన వధువు – మధుసూదనుడైన శ్రీకృష్ణుని నేత్ర విలాసంవల్ల మన్మధ వికారము కలుగగా, నిశ్చేష్టురాలై అతని ముఖ పద్మముని ధ్యానిస్తున్నది.

ఫెద్ద పెద్ద పిరుదులు గల ఒక కాంత, మోహము భరించలేక – స్వామి చెవిలో ఏదో రహస్యము చెప్పు నెపంతో దగ్గరగా వెళ్ళి, పులకింత కలుగునట్లు చెక్కిలిని ముద్దుపెట్టుకొంటున్నది.

మరొక బాలిక మన్మధ కేళిలో కోరికచేత యమునా నదీ తీరంలో అందమైన వంజుల లత పొదరింటిలో గల శ్రీకృష్ణుని పట్టుబట్టను పట్టుకొని తన చేతితో నీటిలోనికి లాగుచున్నది.

మధురమైన నాదంతో కృష్ణుడు పిల్లనగ్రోవిపై పాడుతున్నాడు.  ఆ పాటకు తగినట్లుగా తనచేతి గాజులతో ఒక బాలిక తాళం వేస్తున్నది.  రాసక్రీడలో కృష్ణునితో నాట్యం చేస్తూ అతని ప్రశంస పొందుచున్నది.

హరి ఒక భామను ఆలింగనం చేసుకోంటున్నాడు. ఒకక లేమను ముద్దు పెట్టుకొంటున్నాడు.  ఓక రామను ఆనందింపజేయుచున్నాడు.  మరియొక భామ వెంటబడి వెళ్ళుతున్నాడు.

కేశవుని కేళి రహస్యములతో అధ్భుతమైనదీ, బృందావనంలో లలితమైనదీ,  కీర్తికరమైనదీ అయిన శ్రీ జయదేవుని కవిత శుభములనిచ్చుగాక.

శ్లో. విశ్వేశామనురంజనేన జనయన్నానందమిందీవర
 శ్రేణీ శ్యామ కోమలై రుపనయన్నంగైరసంగోత్సవం
 స్వస్చందం వ్రజ సుందరీభిరభిత: ప్రయంగమాలింగిత:
 శృంగార: సఖి మూర్తిమానివ మధౌ ముగ్ధో హరి: క్రీడతి

సఖీ! మనోహరుడైన శ్రీహరి గోపికలందరికీ ఆనందాన్ని అందిస్తూ – నల్ల కలువల శ్రేణులవలే శ్యామల కోమలములైన అవయములతో మన్మధోత్సవము జరిపించుతూ, గొల్లభామల అంతరంగములచేత, బహిరంగములచేత ఆలింగనము చేయబడుచున్నవాడై శృంగారమూర్తియై వసంత ౠతువులో కృఈడించుచున్నాడు.

శ్లో. నిత్యోత్సంగ వసద్భుజంగ కబల క్లేశాదివేశాచలం
 ప్రాలేయ ప్లవనేశ్చయానుసరతి శ్రీఖండ శైలానిల:
 కించ స్నిగ్ధ రసాల మౌళి ముకుళాన్యాలోక్య హర్షోదయా
 దున్మీలంతి కుహూ: కుహూరితి కలోత్తాలా: పికానాం గిర:

పాములచే భక్షణము చేయబడిన గాలులు, మలయపర్వతముకు దగ్గరగా వుండి, తమకు పాములు మింగుటచే కలిగిన బాధతో మంచునీటియందు మునిగి ఆ పాముల విషబాధ పోగొట్టుకొనుటకు హిమవత్పర్వతము వైపు పోవుచున్నవి.  మనోహరములైన తియ్య మామిడుల కొనలలోని చిగుళ్ళను చూచి సంతోషంతో హెచ్చుస్తాయిలో మధురముగా కుహూ కుహూ అని కోకిలలు గానం చేస్తున్నవి.

శ్లో. రసోల్లాస భరేణ విభ్రమ భ్రుతామాభీర వామ భ్రువా
 మభ్యర్ణం పరిరభ్య నిర్భరముర:  ప్రేమాంధయా రాధయా
 సాధు త్వద్వదనం సుధామయమితి వ్యాహృత్య గీత స్తుతి
 వ్యాజాదుత్కట చుంబిత: స్మృత మనోహరీ హరి: పాతు వ:

ప్రేమచేత అంధురాలైన రాధ – రాసక్రీడలో సంతోషిస్తున్న విలాసవతులగు గొల్లభామల ముందే శ్రీకృష్ణుని రొమ్ము కౌగిలించుకొని, “కృష్ణా! నీవదనము సుధామయము” అన్నది.  ఈవిధంగా పాట పాడుతూ, కృష్ణమూర్తిని స్తుతిస్తూ ఆ నెపంతో చుంబిస్తూ వుండగా, చిరునవ్వు నవ్వుతూ మనోహరంగా వున్న హరి మనసు పాలించుగాక.

||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే సామోదదామోదరో నామ ప్రధమస్సర్గ:||

(ముందు భాగంలో – ద్వితీయ సర్గం)

 

Your views are valuable to us!