నవాదశ అష్టపది – ఆడియో (Audio track of 19th Ashtapadi)
images/stories/ashtapadi/30 Asta 19 Mugari.mp3
దశమ: స్సర్గ: – చతుర చతుర్భుజ:
శ్లో. అత్రాంతరే మసృణ రోష వశాదసీమ
ని:శ్వాస ని:సహ ముఖీం సుముఖీ ముపేత్య
సవ్రీడమీక్షిత సఖీ వదనాం దినంతే
సానంద గద్గద పదం హరిరిత్యువాచ
రోషంతో నిట్టూర్పులతో చలికత్తె సమక్షంలో వున్న రాధ దగ్గర్కు శ్రీహరి బిడియంతో, ఆనందంతో తడబడుతూ, సాయంకాలవేళ ఇలా చెబుతున్నాడు.
అష్టపది 19
చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోత: దేశవరాళీ రాగాష్టతాళీ తాళాభ్యాం గీయతే
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరం
ప్రియే ! చారుశీలే! ప్రియే ! చారుశిలే
ముంచ మయి మానమనిదానం
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానం (ధృవం)
సత్యమేవాసి యది సుదతి ! మయి కోపినీ
దేహి ఖర నఖర శర ఘాతం
ఘటయ భుజ బంధనం జనయ రద ఖండనం
యేనవా భవతి సుఖ జాతం
త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం
త్వమసి మమ భవ జలధి రత్నం
భవతు భవతీహ మయి సతతమనురోధినీ
తత్ర మమ హృదయ మతియత్నం
నీల నళినాభమపి తన్వి ! తవ లోచనం
ధారయతి కోక నద రూపం
కుసుమ శర బాణ భావేన యది రంజయసి
కృష్ణ మిదమేత దనురూపం
స్ఫురతు కుచ కుంభయోరుపరి మణి మంజరీ
రంజయతు తవ హృదయ దేశం
రసతు రశనాపి తవ ఘన జఘన మండలే
ఘోషయతు మన్మధ నిదేశం
స్థల కమల గంజనం మమ హృదయ రంజనం
జనిత రతి రంగ పర భాగం
భణ మసృణ వాణి ! కరవాణి చరణ ద్వయం
సరస లసదలక్తక రాగం
స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం
జ్వలతి మయి దారుణో మదన కదనానలో
హరతు తదుపాహిత వికారం
ఇతి చటుల చాటుపటు చారు ముర వైరిణో
రాధికామధి వచన జాతం
జయతి జయదేవ కవి భారతీ భూషితం
మానినీ జన జనిత శాతం
రాధా, నీవు మాట్లాడునప్పుడు నీ దంతముల కాంతితో నా భయమనే చీకటి పారిపోతుంది. నా చకోరములైన కన్నులకు, నీ ముఖబింబము యొక్క అధరామృతముతో సంతోషము కలుగజేయుము.
మంచి శీలము గల ఓ ప్రియ, నాపై కోపము వద్దు. మదనాగ్నితో దహించబడుచున్న నాకు నీ ముఖ కమలం లోని మధువును జుర్రుకోనిమ్ము.
ఇంకా కోపమయితే, నీ గోళ్ళతో గిచ్చుము, నీ బాహువులలో నన్ను బంధించుము, నీ దంతములతో నన్ను కొరుకుము. నీకు ఏవిధం గా ఆనందం కలిగితే ఆవిధంగా నన్ను శిక్షింపుము.
నీవే నా భూషణం, నీవే నా జీవనం. నీవే నా భవజలధి రత్నానివి. నన్ను అనుసరించి నాపై దయజూపుము.
ఓ తన్వీ, నీ కన్నులు ఎర్రని కలువల వలే అందముగా వున్నవి. ఆ ఎర్ర కన్నులనే మన్మధ బాణాలు నా నల్లని శరీరాన్ని కూడా ఎర్రగా చేసిన బాగుండును.
నీ స్తన యుగము పై గల మణి మంజరి నా హృదయాన్ని రంజిల్లజేయు గాక. నీ జఘనములపై గల ఆభరణం మన్మధుని నివేశం తెలియజేయుగాక.
ఓ సుమధుర భాషిణీ, రతి రంగంలో నీ పాదాలు ప్రకాశిస్తూ, తామరల కన్నా ఎక్కువ అందంతో నన్ను రంజింప జేస్తాయి. అటువంటి నీ పాదాలకు ఎర్రుపు రంగు పూస్తాను.
నీ పాదాలను నా తలపై పెట్టుము. అవి మన్మధుడనే విషానికి విరుగుడు కదా. మన్మధుని వలన కలిగిన వికారములు నీ చరణాల వలన తొలగిపోవును.
శ్రీకృష్ణుడు రాధతో సుందరములుగా, మధురములుగా, చతురములుగా పలికినట్లు చెప్పిన
జయదేవుని గీతములు యువతీ జనుల హృదయాలను రంజిల్ల జేయుగాక.
శ్లో. పరిహర కృతాతంకే ! శంకాం త్వయా సతతం ఘన
స్తన జఘనయాక్రాంతే స్వాంతే పరానవకాశినీ
విశతి వితనోరన్యో ధన్యో న కోపి మమాంతరం
ప్రణయిని ! పరీరంభారంభే విదేహి విధేయతాం
నన్ను శంకింపకుము. పెద్ద స్తనములు, పిరుదులు గల నీవు తక్క వేరెవరికీ నా హృదయంలో స్థానం లేదు. అశరీరి అయిన మన్మధుడు దప్ప వేరొకరు నా హృదయంలో ప్రవేశింపలేడు. నీ కౌగిలితో నన్ను తృప్తి పరచుము.
శ్లో. ముగ్ధే ! విదేహి మయి నిర్దయ దంత దంశం
దోర్వల్లి బంధ నిబిడ స్తన పీడనాని
చండి ! త్వమేవ ముదముద్వహ పంచ బాణ
చాండాల కాండ దళనా దసవ: ప్రయంతి
ముగ్ధురాలా, నీ దంతములతో నన్ను కొరుకుము. నీ బాహువులలో నన్ను బంధింపుము. నీ కఠినమైన కుచములతో పీడించుము. ఓ చండీ, దయలేని ఆ మన్మధుడు నా శరీరాన్ని బాణాలతో గాయపరచి ప్రాణాములు తీస్తున్నాడు. నీకు ఆనందమే కదా.
శ్లో. శశిముఖి ! తవ భాతి భంగుర భ్రూ:
యువ జన మోహ కరాళకాళసర్పీ
తదుదిత భయ భంజనాయ యూనాం
త్వదధర శీధు సుధైవ సిద్ధ మంత్ర:
ఓ చంద్రముఖీ, నీ కనులు యువజనులను మూర్చింపజేయు సర్పములవలే వున్నవి. ఆ సర్ప భయం పోవాలంటే, నీ అధరామృతమే సిద్ధ మంత్రము.
శ్లో. వ్యధయతి వృధా మౌనం తన్వి ! ప్రపంచయ పంచమం
తరుణి ! మధురాలాపైస్తాపం వినోదయ దృష్టిభి:
సుముఖి ! విముఖీ భావం తావద్విముంచ న ముంచ మాం
స్వయమతిశయ స్నిగ్ధో ముగ్ధే ! ప్రియోయ ముపస్థిత:
ఓ తరుణీ, నీ మౌనం నన్ను పీదిస్తున్నది. పంచమ స్వరంతో మధురముగా పలుకుము. నీ చూపులతో నా పరితాపమును తొలగించుము. ఓ సుముఖీ, విముఖురాలివై నన్ను విడిచిపెట్టవద్దు. ఓ ముగ్ధ, ఎంతో ప్రేమతో నేను నీ దగ్గరకు వచ్చాను. నన్ను వంచింపకుము.
శ్లో. బంధూక ద్యుతి బాంధవోయమధర: స్నిగ్ధో మధూక చ్చవి:
గండశ్చండి ! చకాస్తి నీల నళిన శ్రీ మోచనం లోచనం
నాసాత్యేతి తిల ప్రసూన పదవీం కుందాభదంతి ! ప్రియే
ప్రాయ స్త్వన్ముఖ సేవయా విజయతే విశ్వం స పుష్పాయుధ:
ఓ చండీ, తెల్లని దంతములు కలదానా, నీ ముఖమును సేవించుతచే మన్మధుడు విశ్వాన్ని జయించాడు. నీ అధరములు బంధూక పువ్వు కాంతితో వున్నది. నీ కళ్ళు నల్లని కలువల వలే వున్నవి. నీ చెక్కిలి మధూక పుష్పం వలే వుంది. నీముక్కు నువ్వు పుష్పం లాగా వుంది.
శ్లో. దృశౌ తవ మదాలసే వదనమిందు సందీపనం
గతిర్జన మనోరమా విధుత రంభ మూరుద్వయం
రతిస్తవ కలావతీ రుచిర చిత్రలేఖే భ్రువౌ
అహో ! విబుధ యౌవతం వహసి తన్వి ! పృధ్వీ గతా
రాధా నీ చూపులు మదాలసలు, నీ వదనం ఇందుమతి వలే ఉజ్వలం, నీ కదలిక జనులకో మనోరమములు, నీ తొడలు అరటి స్తంభముల కంటే ఘనము, నీ రతి కౌశలం కలావంతము, నీ కనుబొమలు చిత్రమైన రేఖలు, నీవు ఈ భూమిపై గల దేవలోకపు దానవు.
శ్లో. స ప్రీతిం తనుతాం హరి: కువలయాపీడేన సార్ధం రణే
రాధా పీన పయోధర స్మరణ కృత్కుంభేన సంభేదవాన్
యత్ర స్విద్యతి మీలతి క్షణమపి క్షిప్రం తదాలోకన
వ్యామోహేన జితం జితం జితమభూత్కంసస్య కోలాహల:
కువలయపీడ కుంభస్థలం రణంలో శ్రీహరి చూచినప్పుడు, రాధ యొక్క పీనపయోధరములు గుర్తుకు రాగా, క్షణకాలం ఆయనకు ఆనందంతో కన్నులు మూసికొనగా, తనే గెలిచానని భ్రాంతి తో చిందులు వేస్తున్న కంసుని జూచి నిర్భయంగా జూస్తున్న కృష్ణుడు మనకు
ఆనందం కలిగించుగాక.
||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే చతురచతుర్భుజో నామ దశమస్సర్గ:||
{jcomments on}