వింశతి అష్టపది – ఆడియో (Audio track of 20th Ashtapadi)
images/stories/ashtapadi/31 Asta20 Kalyani.mp3
ఏకాదశ: స్సర్గ: – సానంద దామోదర:
శ్లో. సుచిరమనునయనేన ప్రీణయిత్వా మృగాక్షీం
గతవతి కృతవేశే కేశవే కుంజశయ్యాం
రచిత రుచిర భూషాం దృష్టి మోషే ప్రదోషే
స్ఫురతి నిరవసాదం కాపి రాధాం జగాద
కేశవుడు ఉచితమైన దుస్తులు ధరించి, మృగాక్షిణి యైన రాధను అనునయించి, పొదరింటిలోని పూలశయ్యపైకి జేరాడు. దు:ఖము తొలగినదై రాధ కూడా రతికి అనుసారమైన దుస్తులు దివ్య భూషణములు ధరించినది. ఆ సమయంలో రాధతో చెలికత్తె ఇలా అంటున్నది.
అష్టపది 20
శ్రీహరితాళరాజి జలధరవిలసిత: వసంత రాగ యతి తాళాభ్యాం గీయతే
విరచిత చాటు వచన రచనం చరణే రచిత ప్రణిపాతం
సంప్రతి మంజుళ వంజుళ సీమని కేళిశయన మనుయాతం
ముగ్ధే ! మధు మధన మనుగత మనుసర రాధికే (ధృవం)
ఘన జఘన స్తన భార భరే దర మంధర చరణ విహారం
ముఖరిత మణి మంజీరముపైహి విదేహి మరాళ వికారం
శృణు రమణీయతరం తరుణీ జన మోహన మధురిపు రావం
కుసుమ శరాసన శాసన వందిని పిక నికరే భజ భావం
అనిల తరళ కిసలయ నికరేణ కరేణ లతా నికురుంబం
ప్రేరణమివ కరభోరు కరోతి గతిం ప్రతి ముంచ విలంబం
స్ఫురితమనంగ తరంగ వశాదివ సూచిత హరి పరిరంభం
పృచ్చ మనోహర హార విమల జల ధార మముం కుచ కుంభం
అధిగతమఖిల సఖీభిరిదం తవ వపురపి రతి రణ సజ్జం
చండి ! రణిత రశనా రవ డిండిమ మభిసర సరస మలజ్జం
స్మర శర సుభగ నఖేన సఖీ మవలంబ్య కరేణ సలీలం
చల వలయ క్వణితై రవబోధయ హరిమపి నిగదిత శీలం
శ్రీ జయదేవ భణిత మధరీకృత హారముదాసిత వామం
హరి వినిహిత మనసా మధితిష్టతు కంఠతటీ మవిరామం
ఓ ముగ్ధురాలైన రాధ ! మధురమైన మాటలాడువాడునూ, నీ పాదాక్రాంతుడును అయిన కృష్ణుడు నీతో కృఈడించడానికి అనుకూలమైన శయ్యపై వున్నాడు. నీవు ఆ మధుసూదనుని అనుసరించుము.
ఘనమైన పిరిదులు మరియు కుచములు కలదానా, మందగంఅనముతో మణిమంజీరముల చప్పుళ్ళతో వానిని జేరుము.
తరుణీ జనులకు మోహనైన మాధవుని మధురిపు రావం విను. మదనుని శాసనాన్ని వందనజేసే కోకిలారావాన్ని విను.
ఏనుగు తొండము వంటి తొడలు గలదానా, తీగలు తమ చిగురాకుల చేతులతో విలంబన లేకుండా వాని వద్దకు వేళ్ళమని పృఏరేపిస్తున్నాయి.
కుంభాల వంటి స్థనములపై హారములనెడి జనధారలు మదనుని తరంగాల వలన కదులుచూ, నీకు హరి యొక్క కౌగిలింత కలదని చెబుతున్నాయి. నిజమో కాదో ఆ కుచకుంభాలనే అడుగు.
ఓ చండీ, నీ అలంకారమును బట్టి సఖులందరికీ నీవు రతిరణాని వెళుతున్నట్లు తెలిసిపోయింది. కనుక సిగ్గు పడకుండా నీ ఆభరణాలు ధ్వని చేస్తుండగా స్వామి చెంత జేరుము.
మన్మధుని బాణములవంటి చక్కని గోళ్ళు కల నీ చేతులతో, సఖి సహాయంతో, నీ స్వామి చెంతకు పొమ్ము. నీ గాజుల రవళితో నీ రాకను వానికి ఎరిగించుము.
శ్రీ జయదేవ కవి విరచిత గీతాలు స్ట్రీల హారముల వలే గాక, హరియందు మనసు గల
భక్తులందరి కంఠసీమ లో ఎల్లప్పుడూ ఉండుగాక.