గీత గోవిందం – ఏకాదశ సర్గము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఏకవింశతి అష్టపది – ఆడియో (Audio track of 21st Ashtapadi)

images/stories/ashtapadi/32 Asta 21.Khanata.mp3                                  

  


శ్లో. అక్ష్ణోర్నిక్షిపదంజనం శ్రవణయోస్తాపించ గుచ్చావలీం
 మూర్ధ్నీ శ్యామ సరోజ దామ కుచయో: కస్తూరికా పత్రకం
 ధూర్తానామభిసర సంభ్రమ జుషాం విష్వజ్ణికుంజే సఖి
 ధ్వాంతం నీల నిచోళ చారు సుదృశాం ప్రత్యంగ మాలింగతి

కళ్ళలో కాటుక, తలలో నల్లని కలువపూలు, స్తనములపై కస్తూరి రేఖలు, కప్పుకొనుటకు నల్లని దుప్పటి వలే ఈ చీకటి ప్రకాశిస్తున్నది.  ఇది ధూర్తతతో అభిసరించే స్త్రీల అంగాలను కౌగిలించుకొంటునట్లుగా భాసిస్తున్నది.

శ్లో. కాశ్మీర గౌర వపుషా మభిసారికాణాం
 ఆబద్ధ రేఖమభితో రుచి మంజరీభి:
 ఏతత్తమాల దళ నీలతమం తమిస్రం
 తత్ప్రేమహేమ నికషోపలతాం తనోతి

అభిసారికల శరీరాలు కుంకుమ పువ్వులవలే వున్నాయి.  వారి మణిమంజీరాల కాంతులు వారి చేతులపై వ్యాపించి యున్నవి.  ఈ నల్లని చీకటి శ్రీకృష్ణుని ప్రేమ యనే బంగారాన్ని పరీక్షించే ఒరిపిడి రాయి వలే వుంది.

శ్లో. హారావళీ తరళ కాంచన కాంచిదామ
 కేయూర కంకణ మణి ద్యుతి దీపితస్య
 ద్వారే నికుంజ నిలయస్య హరిం నిరీక్ష్య
 వ్రీడావతీ మధ సఖీ మియ మిత్యువాచ

హారాల్లో మధ్య కల నాయికామణి కాంతి, మంజీర కంకణముల మణుల కాంతి తో చీకటి తొలగిపోగా, హరిని జూచి సిగ్గు పడిన రాధను జూచి సఖి ఇలా అంటున్నది.

                      

అష్టపది 21


  • సానందదామోదర ప్రేమద్రుమపల్లవ: వరాళీ రాగ రూపక తాళాభ్యాం గీయతే

మంజుతర కుంజ తల కేళి సదనే
ఇహ విలస రతి రభస హసిత వదనే
ప్రవిశ రాధే ! మధవ సమీపమిహ
కురు మురారే ! మంగళ శతాని    (ధృవం)

నవ లసదశోక దళ శయన సారే
ఇహ విలస కుచ కలశ తరళ హారే

కుసుమ చయ రచిత శుచి వాస గేహే
ఇహ విలస కుసుమ సుకుమార దేహే

మృదు చల మలయ పవన సురభి శీతే
ఇహ విలస మదన శర నికర భీతే

వితత బహువల్లి నవ పల్లవ ఘనే
ఇహ విలస పీనకుచ కుంభ జఘనే

మధు ముదిత మధుప కుల కలిత రావే
ఇహ విలస కుసుమశర సరస భావే

మధురతర పిక నికర నినద ముఖరే
ఇహ విలస దశన రుచి రుచిర శిఖరే

విహిత పద్మావతీ సుఖ సమాజే
భణతి జయదేవ కవి రాజ రాజే

రతిక్రీడ యందు ఉత్సాహంతో నగుమోము గల ఓ రాధ, అందమైన క్రీడా గృహంలో మాధవుని సమీపానికి జేరుము.

కుచ కలశములపి తరళములైన హారము గలదానా, లేత అశోక దళాల పానుపు పై జేరుము.

కుసుమ సుకుమారమైన దేహము కలదానా, పూలతో అలంకృతమైన శుభ్రమైన శయనగృహంలోకి ప్రవేశించుము.

మదనుని శరములకు భీతిల్లినదానా, మృదువైన మలయ మారుత పరిమాల ను పొదరింటిలో అనుభవించు.

విలాసవంతమైన చనులు మరియు పిరుదులు కలదానా, దట్టమైన తీగలు లతల సౌంద్ర్యాన్ని పొదరింటిలో అనుభవించు.

పూలబాణములు ధరించిన మదనుని యందు సరసమైన భావం కలదానా, తేనెలు త్రావిన తుమ్మెదలు మ్రోగెడి పొదరింటిలో ఆనందమును అనుభవించుము.

పద్మావతి తో (జయదేవుని భార్య పేరు పద్మావతి) గూడి కవిరాజు జయదేవుడు ఆనందంతో

గీతములు పాడుతుంటే అందరకూ సుఖము కలుగుగాక.

 

Your views are valuable to us!