ద్వావింశతి అష్టపది – ఆడియో (Audio track of 22nd Ashtapadi)
images/stories/ashtapadi/33 Asta 22 Mathimavathi.mp3
శ్లో. త్వాం చిత్తేన చిరం వహన్నయమతి శ్రాంతో భృశం తాపిత:
కందర్పేణ చ పాతుమిచ్చతి సుధా సంబాధ బింబాధరం
అస్యాంకం తదలంకురు క్షణమిహ భ్రూ క్షేప లక్ష్మీ లవ
క్రీతే దాస ఇవోపసేవిత పదాంభోజే కుత: సంభ్రమ:
స్వామి మన్మధ బధతో నిన్ను చిరకాలం తలచి తలచి అలసినాడు. నీ అధరపానము చేయు కోరికతో ఉన్నాడు. క్ష్ణకాలం అతని వక్షస్తలమును జేరుము. నీ పాదాక్రాంతుడైన అతని వలన భయమెందుకు.
శ్లో. సా ససాధ్వస సానందం గోవిందే లోల లోచనా
శింజాన మంజు మంజీరం ప్రవివేశ నివేశనం
గోవిందుని యందు మగ్నమైన కన్నులు గల రాధ భయంతో, ఆనందంతో, అందెల రవములతో పొదరింటిలోనికి ప్రవేశించింది.
ఈ 22వ అష్టపదిని దక్షిణ భారత భజన సాంప్రదాయంలో కళ్యాణ అష్టపది అంటారు. దీనిని భజన పద్ధతిలో రాధా/రుక్మిణీ/సీతా/పద్మావతీ కళ్యాణం చేసేరోజు ప్రత్యేకంగా పాడుతారు.
అష్టపది 22
- సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణ: వరాళీ రాగ యతి తాళాభ్యాం గీయతే
రాధా వదన విలోకన వికసిత వివిధ వికార విభంగం
జల నిధిమివ విధు మండల దర్శన తరళిత తుంగ తరంగం
హరిమేక రసం చిరమభిలషిత విలాసం
సా దదర్శ గురు హర్ష వశంవద వదనమనంగ నివాసం (ధృవం)
హారమమలతర తారమురసి దధతం పరిలంబ్య విదూరం
స్ఫుటర ఫేన కదంబ కరంబితమివ యమునా జల పూరం
శ్యామళ మృదుళ కళేబర మండలమధిగత గౌర దుకూలం
నీల నళినమివ పీత పరాగ పటల భర వలయిత మూలం
తరళ దృగంచల చలన మనోహర వదన జనిత రతి రాగం
స్ఫుట కమలోదర ఖేలిత ఖంజన యుగమివ శరది తడాగం
వదన కమల పరిశీలన మిళిత మిహిర సమ కుండల శోభం
స్మిత రుచి రుచిర సముల్లసితాధర పల్లవ కృత రతి లోభం
శశి కిరణ చ్చురితోదర జలధర సుందర సుకుసుమ కేశం
తిమిరోదిత విధు మండల నిర్మల మలయజ తిలక నివేశం
విపుల పులక భర దంతురితం రతి కేళి కలాభిరధీరం
మణి గణ కిరణ సమూహ సముజ్వల భూషణ సుభగ శరీరం
శ్రీ జయదేవ భణిత విభవ ద్విగుణీకృత భూషణ భారం
ప్రణమత హృది వినిధాయ హరిం సుచిరం సుకృతోదయ సారం
చంద్రుని చూచి ఉప్పొంగేడి సముద్రము వలే హృదయం లో సంతోషం పెల్లుబికినవాడు, రాధ పట్ల అనురాగము కలవాడు, ఎల్లకాలం ఆమెతో విలాసాన్ని కోరినవాడును, ఆనందంతో వెలుగుచున్న ముఖము కలవాడు, మన్మధ నివాసుడు అయిన శ్రీహరిని రాధ చూచెను.
కృష్ణుని రాధ కౌగిలించినపుడు, ఆమె హారం కృష్ణుని యదపై పడింది. అప్పుడు కృష్ణుడు ఆమెకు తెల్లని నురుగుతో ప్రకాశిస్తున్న నల్లని యమునా నది వలే కనిపించాడు.
పీతాంబరము ధరించిన నల్లని మృదువైన శరీరం గల స్వామి, పచ్చని పరాగముతో కప్పబడిన నల్లని కలువ వలే రాధకు కనిపించాడు.
అందమైన కన్నుల ముఖములో రతియందు ఆసక్తి గలిగి, వికసించిన కలువల నడుమ నల్లని పక్షి యుగము గల సరస్సు వలే కనిపిస్తున్నాడు.
రాధ యొక్క కమలమనే ముఖాన్ని చూచుటకు వచ్చిన సూర్యుని వలే దేదీప్యమైన కర్ణకుండలములు గలవాడు, అందమైన పెదవిపై చిరునవ్వు చిందించుచూ రతి యందు ఆసక్తి కనబరచినవాడు లగా శ్రీ హరి కనిపించాడు.
నల్లని కేశముల మధ్య తెల్లని పూలతో హరి మధ్య వెన్నెలతో మెరయు నల్లని మేఘం వలే, చీకటిలో ఉదయించిన చంద్రుడివలే నల్లని ముఖముపై తెల్లని చందన తిలకం కలిగి ఉన్నాడు.
శ్రీరం పూలతో అలంకరింపబడినవాడు, రతికేళి కళలతో చంచలమైనవాడు, మణిగణ భూషనాతో శరీరం పై ప్రకాశిస్తూ కనిపించాడు.
శ్రీ జయదేవుని గీతములచే అభూషణములు ద్విగుణీకృతమైన హరిని సుకృతమును కలిగించమని హృదయము నందు నమస్కరించండి.
శ్లో. అతిక్రమ్యాపాంగం శ్రవణ పధ పర్యంత గమన
ప్రయాసేనేవాక్షో స్తరళతర భావం గమితయో:
ఇదానీం రాధాయా: ప్రియతమ సమాలోక సమయే
పపాత స్వేదాంబు ప్రసర ఇవ హర్షాశ్రు నికర:
శ్రీకృష్ణుని దివ్యమైన రూపమును సేవించెడి వేళ, రాధకు రతికేళికి ఆయత్తమగు సమయమున కలుగు మనోద్వేగము వలన చెక్కిళ్ళపై చెమట బిందువులు ముత్యాల వలే ప్రకాశించాయి.
శ్లో. భజంత్యా స్తల్పాంతం కృత కపట కండూతి పిహిత
స్మితం యాతే గేహాద్భహిరవహితాళి పరిజనే
ప్రియాస్యం పశ్యంత్యా: స్మర పరవశాకూత సుభగం
సలజ్జా లజ్జాపి వ్యగమదివ దూరం మృగదృశ:
రాధకు సంగమాభిలాష ను గమనించిన చెలికత్తెలు పొదరింటిని విడిచి చీకటిలోకి జారుకొనగా, రాధ బిడియము వదిలి కృష్ణుని దరిజేరి తన మనో వంచను వివరించెను.
శ్లో. సానందం నంద సూనుర్దిశతు పరతరం సమ్మదం మంద మందం
రాధామాధాయ భాహ్వోర్వివరమను దృఢం పీడయంప్రీతి యోగాత్
తుంగౌ తస్యా ఉరోజావతను వరతనోర్నిర్గతౌ మా స్మ భూతాం
పృష్టం నిర్భిద్య తస్మాద్బహిరితి వలిత గ్రీవమాలోకయన్వ:
ఆనందంతో కృష్ణుడు, సౌందర్య శృంగార రూపిణిని గట్టిగా కౌగిలించుకొనగా, ఆమే కుచముల మొనలు తన హృదయాన్ని చేదించెనా అని వెనుదిరిగి చూచుచుండగా, రాధ వాని ముఖమును తనవైపుకు త్రిప్పుకొని ఆనందించుచుండెను.
శ్లో. జయ శ్రీ విన్యస్తైర్మహిత ఇవ మందార కుసుమై:
స్వయం సిందూరేణ ద్విప రణ ముదా ముద్రిత ఇవ
భుజాపీడ క్రీడా హత కువలయపీడా కరిణ:
ప్రకీర్ణాసృగ్బిందుర్జయతి భుజ దండో మురజిత:
ఒకప్పుడు కువలయపీడమనే ఏనుగును దాని తొండము మెలిపెట్టి చంపగా దేవతల పూలవర్షంతో ఎర్రనైన బాహువులు ఇప్పుడు రాధను కౌగిలిస్తున్నాయి.
శ్లో. సౌందర్యైకనిధే రనంగ లలనా లావణ్య లీలా జుషో
రాధాయా హృది పల్వలే మనసిజ క్రీడైక రంగ స్థలే
రమ్యోరోజ సరోజఖేలన రసిత్వాదాత్మన: ఖ్యాపయన్
ధ్యాతుర్మానస రాజ హంస నిభతాం దేయాన్ముకుందో ముదం
సకల సౌంద్రయాది గుణములచే ప్రకాశిస్తూ, రతిలీలా వినోద విలాస సాగరమైన రాధా హృదయమున నిరంతమూ విహరించుటచేత మానస రజహంస అని ప్రసిద్ధినొందిన ముకుందుడు ఎల్లరనూ రక్షించు గాక.
||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే రాధికామిలనే సానందదామోదరోనామ ఏకాదశస్సర్గ:||
{jcomments on}