త్రయోవింశతి అష్టపది – ఆడియో (Audio track of 23rd Ashtapadi)
images/stories/ashtapadi/35 Asta 23 Nada namakriya.mp3
ద్వాదశ: స్సర్గ: – సుప్రీత పీతాంబర:
శ్లో. గతపతి సఖీ బృందేమంద త్రపాభర నిర్భర
స్మర పరవశాకూత స్పీత స్మిత స్నపితాధరం
సరస మనసం దృష్ట్వా రాధాం ముహుర్నవ పల్లవ
ప్రసవ శయనే నిక్షిప్తాక్షీమువాచ హరి: ప్రియాం
చెలికత్తెలు అందరూ వెళ్ళిన తరువాత చిరకాలవియోగము కారణంగా మదనతాపారతుడైన కృష్ణుడు రాధతో ఈ విధంగా అంటున్నాడు.
అష్టపది 23
- మధురిపు విద్యాధరలీల: విభాస రగైకతాళీ తాళాభ్యాం గీయతే
కిసలయశయన తలే కురు కామిని ! చరణ నళిన వినివేశం
తవ పద పల్లవ వైరి పరాభవమిదమనుభవతు సువేశం
క్షణ మధునా నారాయణ మనుగత మనుసర రాధికే (ధృవం)
కర కమలేన కరోమి చరణమహ మాగమితాసి విదూరం
క్షణముపకురు శయనోపరి మామివ నూపురమనుగతి శూరం
వదన సుధా నిధి గళితమమృతమివ రచయ వచనమనుకూలం
విరహమివాపనయామి పయోధర రోధకమురసి దుకూలం
ప్రియ పరిరంభణ రభస వలితమివ పులకిత మతిదురవాపం
మదురసి కుచ కలశం వినివేశయ శోషయ మనసిజ తాపం
అధర సుధా రసముపనయ భామిని ! జీవయ మృతమివ దాసం
త్వయి వినిహిత మనసం విరహానల దగ్ధ వపుషమవిలాసం
శశిముఖి ! ముఖరయ మణి రశనా గుణమనుగుణ కంఠ నినాదం
శ్రుతి యుగళే పిక రుత వికలే మమ శమయ చిరాదవసాదం
మామతివిఫల రుషా వికలీకృత మవలోకితు మధు నేదం
లజ్జితమివ నయనం తవ విరమతి విసృజ వృధా రతి ఖేదం
శ్రీ జయదేవ భణితమిద మనుపద నిగదిత మధురిపు మోదం
జనయతు రసిక జనేషు మనోరమ రతి రసభావ వినోదం
ఓ రాధికా, అప్పుడే వికసించిన పూలకన్నా మృదువైన నీ పాదాలను ఈ పూలపానుపు పై పెట్టి, ఈ పువ్వుల గర్వ మణచుము. ఈ నారాయణుని నారీ సహితుని గావించుము.
చాలా దూరం నుండి వచ్చిన కారణంగా నీకు అలసి ఉంటావు. నీవు శయనించిన, నేను ఈ కరములతో నీకు పరిచర్య జేసెదను.
చంద్రుని అమృతకిరణములకన్నా మధురమైన నీ మాటలచే నన్ని రంజిల్లజేయుము. సుందరము, కఠినములైన నీ చనులను గప్పిన వస్త్రమును తీసివేయుము.
ఓ ప్రేయసీ, రోమాంచములైన నీ స్తనములతో నను బిగువుగా ఆలింగనము గావించి మదన తాపమును పోగొట్టుము.
నీ విరహ తాపముచే దగ్ధమైన నన్ను నీ మధురమైన అధరామృతముచే జీవితుని జేయుము.
ఓ చంద్రవదనా, కోకిలారావములతో విసుగెత్తిన నాకు, నీ శ్రావ్యమైన మాటలు అందెల తాళములతో ఆనందింపజేయుము.
నీవు నన్ను అకారణంగా దూషించుట వలన సిగ్గుపడవలదు. ఇక ఆలసింపక నా దరిజేరుము.
శ్రీ జయదేవ విరచితమైన శృంగార రసమయమైన పదములు రసిక జనులకు భావ
వినోదము కలిగించుగాక.
చతుర్వింశతి అష్టపది – ఆడియో (Audio track of 24th Ashtapadi)
images/stories/ashtapadi/36 Asta24 Suriti.mp3
శ్లో. (సురతారంభ చంద్రహాస:)
ప్రత్యూహ: పులకాంకురేణ నిబిడాశ్లేషే నిమేషేణ చ
క్రీడాకూత విలోకితేధర సుధాపానే కధానర్మభి:
ఆనందాధిగమేన మన్మధ కలా యుద్ధేపి యస్మిన్నభూత్
ఉద్భూత: స తయోర్భభూవ సురతారంభ: ప్రియంభావుక:
పిమ్మట రాధాకృష్ణులు అనురాగచిత్తులై, కౌగిలైంతల చుంబనములతో బాహ్యప్రపంచమును మరచి, మన్మధ కలా యుద్ధమును నెరపిరి.
శ్లో. (కామతృప్త కామినీహాస:)
దోర్భ్యాం సంయమిత: పతోధర భరేణాపీడిత: పాణిజై
రావిద్ధో దశనై: క్షతాధర పుట: శ్రోణీ తటేనాహత:
హస్తేనానమిత: కచేధర మధు స్యందేన సమ్మోహిత:
కాంత: కామపి తృప్తిమాప తదహో ! కామస్య వామా గతి:
రాధ, తన బరువైన కుచములతో, కృష్ణుని వక్షమును గట్టిగా న్రొక్కి, వాని భుజములను అదిమిపట్టి, అధరమున అధరము బట్టి రతికేళి సలుపుతూ, శ్రీకృష్ణుడు బాధనొందక ఆనందమునొందుచుండెను.
శ్లో. (పౌరుషరస ప్రేమవిలాస:)
మారాంకే రతి కేళి సంకుల రణారంభే తయా సాహస
ప్రాయం కాంత జయాయ కించిదుపరి ప్రారంభి యత్సంభ్రమాత్
నిష్పందా జఘన స్థలీ శిధిలితా దోర్వల్లిరుత్కంపితం
వక్షో మీలితమక్షి పౌరుష రస: స్త్రీణాం కుత: సిధ్యతి
రాధ కృష్ణునితో రతికేళికి ఉపక్రమించగా, బరువగు పిరుదులు మరియు చను భారమున ఆ తలంపు వ్యర్ధమాయెను.
శ్లో. (కామాద్భుతాభినవ మృగాంకలేఖన:)
తస్యా: పాటల పాణిజాంకితమురో నిద్రా కషాయే దృశౌ
నిర్ధౌతోధర శోణిమా విలుళితా: స్రస్తా: స్రజో మూర్ధజా:
కాంచీదామ దర శ్లాధాంచలమితి ప్రాతర్నిఖాతైర్దృశో
రేభి: కామశరై స్తదద్భుత మభూత్పత్యుర్మన: కీలితం
ఆ రతిక్రీడా వినోదమున రాధ విజృంభించగా ఆమె రవిక జారిపోయెను, చీర ఊడిపోయెను, జుట్టుముడి వీడిపోయెను. ఎర్రని పెదవులు కాంతి వీడెను.
శ్లో. వ్యాలోల: కేశ పాశస్తరళితమలకై: స్వేద మోక్షౌ కపోలౌ
క్లిష్టా బింబాధర శ్రీ: కుచ కలశ రుచా హారితా హార యష్టి:
కాంచీ కాంతిర్హతాశా స్తన జఘన పదం పాణినాచ్చాద్య సద్య:
పశ్యంతీ సత్రపా సా దదపి విలుళితా ముగ్ధ కాంతిర్దినోతి
ముత్యాలహారము చిక్కుబడగా, ముడి వూడిన కేశములు స్వేదమున దడిసి చికాకు పరచుచుండగా, రతిక్రియలో గలిగిన చెమటను ఒక చేతితో తుడుచుకొనుచూ, సిగ్గుచే ఒకచేత వక్షమును గప్పుకొనుచూ అర్ధ నిమిల నేత్రములతో మాధవుని జూచుచుండెను.
శ్లో. ఈషన్మీలిత దృష్టి ముగ్ధ విలసత్సీత్కార ధారా వశాత్
అవ్యక్తాకుల కేళి కాకు వికసద్దంతాంశు ధౌతాధరం
శాంత స్తబ్ద పయోధరం భృశ పరిష్వంగాత్కురంగీ దృశో
హర్షోత్కర్ష విముక్త ని:సహ తనోర్ధన్యో ధయత్యాననం
రతి శ్రమముతో ఆయాసము జెందిన రాధను జూచి దగ్గరకు జేర్చి, గాఢముగా ఆలింగనము జేసి, అధరమూనుచుండగా, రాధ ఆనందాతిశయమున అరమోడ్పులతో మాధవుని సౌందర్యము గాంచుచూ సుఖమునొందెను.
శ్లో. అధ సహసా సుప్రీతం సురతాంతే సా నితాంత ఖిన్నాంగీ
రాధా జగాద సాదర మిద మానందేన గోవిందం
అంతట రాధ రతికేళి విలాసమును అనుభవించి, అలసియున్ననూ గోవిందుడు తనయందు కనబరచిన అనురాగము తలచి ఇట్లు చెప్పెను.
అష్టపది 24
సుప్రీతపీతాంబర తాళశ్రీణీ రామక్రియా రాగ యతి తాళాభ్యాం గీయతే
కురు యదు నందన ! చందన శిశిరతరేణ కరేణ పయోధరే
మృగమద పత్రకమత్ర మనో భవ మంగళ కలశ సహోదరే
నిజగాద సా యదు నందనే క్రీడతి హృదయానందనే (ధృవం)
అళికుల గంజనమంజనకం రతి నాయక సాయక మోచనే
త్వదధర చుంబన లంబిత కజ్జల ఉజ్వలయ ప్రియ లోచనే
నయన కురంగ తరంగ వికాస నిరాస కరే శృతి మందలే
మనసిజ పాశ విలాస ధరే శుభ వేశ నివేశయ కుండలే
భ్రమర చయం రచయంతముపరి రుచిరం సుచిరం మమ సమ్ముఖే
జిత కమలే విమలే పరికర్మయ నర్మజనక మళకం ముఖే
మృగమద రస వలితం లలితం కురు తిలకమళిక రజనీకరే
విజిత కళంక కళం కమలానన విశ్రమిత శ్రమ శీకరే
మమ రుచిరే చికురే కురు మానద మనసిజ ధ్వజ చామరే
రతి గలితే లలితే కుసుమాని శిఖండి శిఖండక డామరే
సరస ఘనే జఘనే మమ శంబర దారణ వారణ కందరే
మణి రశనా వసనాభరణాని శుభాశయ వాసయ సుందరే
శ్రీ జయదేవ వచసి రుచిరే సదయం హృదయం కురు మండనే
హరి చరణ స్మరణామృత నిర్మిత కలి కలుష జ్వర ఖండనే
ఓ యదునందనా ! రతి క్రీడయందు అలసిన నాకు తామర తూడులు మరియు చందనము వలే చల్లనైన నీ హస్తములతో నా స్తనములపై కస్తూరి ని అలంకరించుము.
నీ చుంబనముల వలన నా కాటుక పోయినది. నా కనులకు కాటుక దిద్దుము.
నేత్రములనెడి లేళ్ళు పారిపోకుండా రెండు వైపులా పగ్గముల వలే వున్న నా కర్ణములకు కుండలములను పెట్టుము.
వికసించిన పద్మము వలే ఉన్న నా ముఖము పై తుమ్మెద వలే నుండెడి భూషణములను అలంకరించుము.
రతికేళి వలన గలిగిన చేమటతో చెదిరిన తిలకమును దిద్ది ఈ చంద్రబింబములాంటి ముఖము యొక్క అందమును అనుభవించుము.
అభిమానవతుల ప్రేమానురాగములను దొంగిలించువాడా ! రతికేళిలో వీడిన నా కురులను ముడివేసి పువ్వులతో అలంకరించుము.
కొండలవంటి నా పిరుదులపై వస్త్రమును సవరించి అలంకరించుము.
హరి చరణ స్మరణామృతమైన శ్రీ జయదేవుని కృతి సకల జన హృదయములకు ఆనందము కలిగించి కలి కలుషాన్ని హరించుగాక.
శ్లో. రచయ కుచయో: పతం చిత్రం కురుష్వ కపోలయో:
ఘటయ జఘనే కాంచీం ముగ్ధస్రజా కబరీ బరం
కలయ వలయ శ్రేణీం పాణౌ పదే మణి నూపురౌ
ఇతి నిగదిత: ప్రీత: పీతాంబరోపి తధాకరోత్
కృష్ణా, నీ యడబాటులో మన్మధుడు నన్ను వేధించగా, నిన్ను మది దలంచి, నీ చెంతకు జేరి రతి క్రీడలో అలసిన నాకు స్తనములపై మకరి పత్రమును అద్దుము. చెక్కిళ్ళపై చిత్రలేఖనము జేయుము. ఒడ్డాణము పెట్టుము. సిగలో పువ్వులను తురుముము. చేతులకు గాజులు, కాలియందెలు తొడుగుము. ఆంతట పీతాంబరధారి రాధను అలంకరించి ఆమె సౌందర్యమునకు ఆనందించెను.
శ్లో. యద్గాంధర్వ కలాసు కౌశలమనుధ్యానం చ యద్వైష్ణవం
యస్చృంగార వివేక తత్వ రచనా కావ్యేషు లీలాయితం
తత్సర్వం జయదేవ పండిత కవే: కృష్ణైక తానాత్మన:
సానందా: పరిశోధయంతు సుధియ: శ్రీ గీత గోవిందత:
శ్రీవైష్ణవుండగు జయదేవ పండిత కవి, శ్రీకృష్ణుని యందు గల తన భక్తినీ, రచనా వైదూష్యముతో శృంగార సంగీత సమ్మిళితమైన ఈ గీత గోవిందమును రచించెను.
శ్లో. శ్రీ భోజదేవ ప్రభస్య రమాదేవీ సుత శ్రీ జయడెవకస్య
పరాశరాది ప్రియ వర్గ కంఠే శ్రీ గీతగోవింద కవిత్వమస్తు
శ్రీ భోజదేవ రమాదేవిల పుత్రుడగు శ్రీ జయదేవుని ఈ గీతగోవింద కావ్యము నా ప్రియతములగు పరాశరాదుల గొంతులందు ధ్వనించుగాక.
శ్లో. సాధ్వీ ! మాధ్వీక ! చింతా న భవతి భవత: శర్కరే ! కర్కశాసి
ద్రాక్షే ! ద్రక్ష్యంతి కే త్వామమృత ! మృతమసి క్షీర ! నీరం రసస్తే
మాకంద ! క్రంద కాంతాధర ధర ! న తులాం గచ్చ యచ్చంతి భావం
యావచృంగార సారం శుభమివ జయదేవస్య వైదగ్ధ్య వాచ:
ఎల్లరికీ శుభమును కలుగజేయు శృంగార రస భరితమైన జయదేవుని గీతగోవింద కావ్య నుందు చక్కెర యంతో కఠినమైనది, ద్రాక్ష పువ్వు కల దోషమున్నది, అమృతము మృతమైనది, పాలు నీరుగారి పోయినది, మామిడీ నీ యందు టెంకె కలదు, కాంతాధరోష్టమా మీరెవరూ సాటిరారు.
శ్లో. ఇథం కేళి తతిర్విహృత్య యమునాకూలే సమం రాధయా
తద్రోమావళి మౌక్తికావళి యుగేవేణీ భ్రమం బిభ్రతి
తత్రాహ్లాది కుచ ప్రయాగ ఫలయోర్లిప్సావతోర్హస్తయో:
వ్యాపారా: పురుషోత్తమస్య దదతు స్పీతాం ముదం సంపదం
ఈవిధంగా యమునానదీ తటమున రాధ యొక్క స్తనముల పట్టుట యందు ఆసక్తుడైన పురుషోత్తముని కేళీలీలలు గల ఈ కావ్యమును చదివినవారికి, వినినవారికి సకల సౌభాగ్యములు కలుగుగాక.
||ఇతి శ్రీజయదేవకృతౌ గీతగోవిందే సుప్రీతపీతాంబరో నామ ద్వాదశస్సర్గ:||
మంగళము
చిత్తజుని కన్నయకు జయ మంగళం
మదహరిభక్తికైన చిత్తవృత్తుడోత్తమునకు (చిత్తజుని)
అందమైన చంద్రుని నిందించు ముఖారవింద
మిందిరానంద గోవింద నందనందనుకీ (చిత్తజుని)
బాలరామ రాముడై క్షేమమొసగు సకల గుణ
రాముడౌ మా పట్టాభి రామస్వామీ రూపునకూ (చిత్తజుని)
కోరి భక్తిమీర జేరి దారికన్న వారి కలుషారి వారి
భూరి వైభవ కస్తూరి రంగ శౌరి కినీ (చిత్తజుని)
మా రామభద్రునికి జయ మంగళం
గోపల కృష్ణునికి శుభ మంగళం
సద్గురూ స్వామికి జయ మంగళం
ఆంజనేయ స్వామికి శుభ మంగళం
ముకుంద రాధే ముకుంద రాధే ముకుంద రాధే మాంపాహి
కళ్యాణ రాధే కళ్యాణ రాధే కళ్యాణ రాధే మాంపాహి
{jcomments on}