ఈ-పుస్తకం – వైకుంఠపాళి

Spread the love

Download

File Description File size Downloads
pdf Vaikunthapali eBook Vaikuntha Pali novel
1 MB 932
Like-o-Meter
[Total: 1 Average: 4]

 

జీవితానికి నిర్వచనాలు అనేకాలు.

కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే “వైకుంఠపాళీ” ఆట.

ఎవరు ఎప్పుడు ఎలా కనిపెట్టారో తెలియని ఈ ప్రాచీనమైన ఆట హైందవసంస్కృతిలో కలగలసిపోయింది. చిన్నతనంలోనే జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను పట్టుదలతో దాటగలిగే మనోనిబ్బరాన్ని కలిగించగలిగే ఒక అపురూపమైన ఆట ‘వైకుంఠపాళీ’.

జీవితానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య వారధిలా నిలిచిన ఈ ఆటను ఇతివృత్తంగా తీసుకుని, లక్ష్మీనారాయణుల్ని ఆటగాళ్ళుగానూ, రెండు జంటలు పావులుగానూ కూర్చి, వైకుంఠపాళిలో దాగివున్న ఆధ్యాత్మిక, మనోవైజ్ఞానిక విశేషాల్ని వివరిస్తూ సాగే “వైకుంఠపాళీ” నవలిక యొక్క ఈ-పుస్తకం మీ కోసం….

 

Your views are valuable to us!