ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు. మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో,…