1 ఏమీ తెలియకపోవడం గుర్తు పట్టకపోవడం మరచిపోవడమూ – ఇవి కూడా బాగుంటాయి అప్పుడప్పుడూ. 2 పూల గురించి అంతా తెలుసు అనుకుంటాను వాటి మెత్తని శరీరాన్ని నిమురుతున్నప్పుడు నా గరుకుతనం గుర్తొస్తుంది. 3 ముళ్ళ ని ఇట్టే…
Tag: అఫ్సర్ రచనలు
ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో…
ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి? నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం!
పూవు క్షణికమే….పరిమళం సదా!
వంతెనలు చాలా అవసరం. వంతెనల్లేని సమాజాన్ని ఊహించలేం. ఆ గట్టునూ, ఈ గట్టునూ ఏకకాలంలో పలకరించగలిగే ఆత్మీయబంధువది. అంతేనా, గట్టుల్ని చీలుస్తూ పారే నదిని సాదరంగా వెళ్ళనిస్తుంది. కొండకచో దాని ఉద్దృతిని ఆపివుంచి ప్రమాదాల్ని నివారిస్తుంది కూడా. తెలుగు సాహిత్యసీమలో కొన్ని…
ఒక పాట జ్ఞాపకం
ఈ మధ్య మేం నాన్నగారి (కౌముది) కవిత్వం పుస్తకం “అల్విదా” వేసే ప్రయత్నంలో మా తమ్ముళ్ళు, మా మేనల్లుడు ఖమ్మంలో మా ఇంట్లో గుట్టలుగా పడి వున్న నా పాత కాయితాలన్నీ వెతికే యజ్ఞంలో పడ్డారు. పాత కాయితాలు వెతుకుతున్నప్పుడు ఏం…
అంతకన్నా
1 పొద్దున్నే కిటికీ రెక్క అద్దాన్ని పొడిచి రెక్కలేగరేసి ఆడుకుంటుంది చామన చాయలో, వొక చలికాలపు గడ్డకట్టిన రాత్రి తరవాత, నీరెండ. సర్లే, పోనీలే అనగలనా, దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా. దాని చేతిలో చెయ్యేసి, తన గోర్వెచ్చనితనాన్ని…
ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా…
1 శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ లేత వయసులో- అంటే టీనేజీ అని నా ఉద్దేశం- శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి…
ఆ పూట మున్నేరు పాడలేదు!
ఆరో తరగతి సెలవులకి ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది. “మనం ఖమ్మం వెళ్లిపోతున్నాం” అని ఆ సెలవుల ముందే నాన్నగారు ఇంట్లో చెప్పారు. ఆ ఎండాకాలం చింతకానిలో నాకు చివరి ఎండాకాలం అవుతుందని తెలియదు. నా చదువు మొదలయ్యింది చింతకానిలో!…