తెరలు తెరలుగాఅవే ప్రశ్నలు.. అలలవుతూమనిద్దరి మధ్య నన్ను శోధిస్తానునిన్ను ప్రశ్నిస్తానుతెలుసుకునే లోపేమరోప్రశ్న ..తెలుసనుకున్న దాన్నితిరిగి ప్రశ్నిస్తూ.. వృత్తంలా పరిచి ఉంచినపట్టాల మధ్య, ఇది,ముడులు విప్పుకుంటూ..గుంటలు పూడ్చుకుంటూ..పరుగనిపిస్తుంది ..మనమధ్య దూరమికలేదనిపిస్తుంది. ఈలోపలనీ అస్థిత్వాన్నీ,నా విశ్వాసాన్నిప్రశ్నిస్తూ.. మరో నెర్ర. అతుకుల చక్రం సాగుతుందిమరో అతుకుని…
Tag: ఆత్రేయ కొండూరు రచనలు
తొలి జాము
నిన్న దాచిన రంగుల చిత్రాన్ని రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది ** మబ్బుల మగ్గాన్ని దూరాన ..మిణుగురు దండు తరుముతోంది ** పక్షి గుంపులు ఆకాశంలోఅక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి ** పొగమంచు తెరలు తీసి ఉదయంచెరువులో రంగు ముఖన్ని చూసుకుంటొంది ** జోడెద్దులు గంటల…
ఈ ఉదయం
బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరిగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్ల పదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.
జ్ఞాపకాల గుబాళింపు
నిద్ర జార్చుకున్న నింగి మధ్య విరగ పూసిన కలువ ఆపై వేచిన తుమ్మెద పలకరింపు.. కంటి కొలకులు చూసిన ముత్యాల పలవరింపు.. అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ.. వడిలిన తెరల వెనకగా ఎగబ్రాకిన వేకువ కిరణం.. వెచ్చగా ఒళ్ళు విరుచుకున్న…