అన్నీ వార్తలే!

ఈ మధ్య అన్నీ వార్తలే కదా 1. ఇప్పుడు మనం ఆటలాడటం మర్చిపోయి చాలా కాలం అయింది. ఎవరో ఎక్కడో ఆడుతుంటారు, ఇక్కడ మనం టీ.వి లో చూస్తుంటాము బాబయ్యా!  ఆడేవారూ ఆటకోసం ఆడరు సోదరా! వాళ్ళు డబ్బూ, మందూ, స్త్రీల…

మధురోక్తి

1 కొన్ని మధుపాత్రల్నినేనే పగలగొట్టానుమరికొన్నేవోఅవే పగిలాయి- వాటిని ఏరివేయడంలోనే రాత్రంతా గడిచిపోతుంది- 2 బహుకాలానికి దొరికిన వొర్షించే చీకటి వొటరితనం —నన్ను నేను తడుముకోవాలి విటపురంలో నర్తించి నర్తించీ నెత్తురొడుస్తున్న పాదాలు.. ఆకస్మికంగా బహుమానించుకొన్న ముసురు-నన్ను నేను స్పర్శించుకొని ముద్దాడుకోవాలి-జలదరిస్తూతూలుతున్న బహిరంతర…

పురా రాగం

1 అమరగాన మోహ దాహర్తి సహస్రాది గ్రీష్మారణ్యాల సంచారం…. 2 వెయ్యిన్నొక్క మార్మిక స్వప్న రంగులు వేచి చూస్తున్నాయివొకే వొక్క మంత్ర చిత్ర గానం కోసం… 3 రుతువులు వొస్తూ వుంటాయిపోతూవుంటాయిఒక్క వేణువుని ప్రసాదించలేని తనంతో…. 4 వొకేవొక్క సామవేద వాయులీన స్పర్శ…

కరచాలనం, ఓరచూపు, స్పర్శ!

కరచాలనం ఒక చక్కటి అనుభూతి అనడంలో సందేహం లేదు. వ్యక్తిని బట్టి అనుభూతి మారుతుంది. కొంతమంది మృదువుగా, మరి కొంతమంది అంటీ అంటకుండా, ఎంతసేపటికీ చెయ్యిని వదలనివారు కొందరు. ఇలా రకరకాల షేక్ హ్యేండ్స్. కొంతమంది ఇచ్చే షేకులకు చేతులు విరుగుతాయా అనిపిస్తుంది. స్నేహితుడి కరచాలనం…

ముమ్మాట!

1.అలిగిమొహం మాటేసిఅలా వెళ్ళి క్షమించిమళ్ళీ మూన్ వాక్చేస్తావని ఆశ వుండేది! కానీకనుపాపల పై ఇనుప తెరలు పరిచావ్…. 2తేనె కత్తులుతయారు చేసుకొని పెట్టుకున్నాను, నువ్వొచ్చిముద్దాడి పోతేమింగుదామని… 3చాలా సంవత్సరాల క్రితంరాసి పంపని ప్రేమలేఖ ఇదిఇప్పటికీ పచ్చి వాసన వేస్తో… కాని భాష…

మిస్డ్ కాల్

మంచు కత్తితో పొడిచి సాక్ష్యం లేకుండానే పారిపోయే మొరటు సరసం…   మంచినిద్రలో చెంప పై ఛళ్లుక్కున చాచికొట్టి మాయమైన మెరుపు పిలుపు…   అకవుల అద్దె ఏడ్పు, దొంగ ఆర్ద్రతలా స్వప్నపుష్పంపై వాలి చెరుస్తున్న మిడుతల దండులా నీ గొంతు……

అస్తిత్వ వేదన కవులు – 2

మూలం:శ్రీ ఇక్బాల్ చంద్ పరిశోధనా గ్రంథం “ఆధునిక తెలుగు సాహిత్యంలో జీవన వేదన” అస్తిత్వ వేదన కవులు – శ్రీరంగం నారాయణ బాబు శ్రీరంగం నారాయణ బాబు 17/05/1906న విజయనగరంలో పుట్టాడు. తండ్రి పేరు శ్రీరంగం సుందర నారాయణ. వీరు వకీలుగా…

పునర్మిలనం

చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది!   పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు!   అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం…