ఎదురింటి బాల్కెని

ఎప్పుడైనా ఓసారిఆ గోడల మీదకాకులొచ్చి వాలేవి. ఆవిడొచ్చిరంగురంగు పావురాళ్ళనుమొక్కలకు పూయించింది. చిట్టి చేతుల్తో తీగ పాదుల్నితట్టి లేపింది. అంతా గుప్పెడు మట్టే. పువ్వుగా ఎదిగేవిత్తనాన్నిసుతిమెత్తగాతడిమి చూసింది. అభిమానం ఎరువుగాచల్లుకుంటూవెళ్ళేదా..? తిరిగొచ్చేసరికి,తీగెలు పరిమళాణ్ణిప్రతిధ్వనించేవి. ఎండిన ఆకు,ఆమె కంట్లోనీటి చుక్కాఒకేసారి రాలి పడేవి. ఆ…