తిరుపతి వేంకటకవులు”అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేరి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. ఆ ఇద్దరు ఒకే ఊరివారు…