"కే సెరా సెరా...." అనే ఒక ఇంగ్లీషు పాట మన తెలుగు సినిమాలో ఉంది తెలుసా?"అత్తగారి కథలు" రచయిత్రి, విదుషీమణి, గాయని, మన తెలుగింటి మణిదీపం, నటీమణి, సకల కళాభినేత్రి శ్రీమతి పి.భానుమతి. ఖంగుమనే ఆమె గొంతులో స్వరాలు వయ్యారాలు పోతాయి. “తోడూ నీడా” సినిమాలో చిన్నపాపను సముదాయించడానికి ప్రయాసపడే ఇల్లాలి పాత్రలో "శభాష్" అనిపించుకున్నది ఆమె. ఆ క్రమంలో అప్పుడు భానుమతి ఒక ఇంగ్లీష్ సాంగ్ నీ సింగింది "కే సెరా సెరా" అంటూ.