నిన్ను వెదికే కన్నులున్నవి ఎన్నడొస్తావు? నిన్న రేపుకు నడుమ నన్ను వదిలివేసావు! భగవాన్! ఏల శోధనలు చాలవా మా నివేదనలు? పల్ల మెరిగిన పిల్లవాగుకు పరుగు నేర్పావు చెట్టు చాటు పిట్ట పాటకు శ్రుతిని కూర్చావు సిగ్గులొలికే మొగ్గపాపకు…
Tag: గోపీనాథ శర్మ రచనలు
చాలు గర్వము
చాలు, గర్వము యేల హరిని తలుచుము వేగ నేలాఇ క్షణముల గణన నిలిచేలోగ మత్సావతారుడే మత్సరమ్మును మాపు కూర్మరూపుడు కర్మతతుల బాపు వత్సా! వరాహుడు దురాశలను బాపు నారసింహుడు దురితదూరు జేయు వామన రూపుడు కామతృష్ణల జంపు –…
రాలిన పూలను జూచి…
రాలిన పూలను జూచి జాలిని చూపగ జాలకకూలిన మానవుల జూచి చలించగలవే? మరి చలించగలవే? మదిలో సద్ధర్మమ్ముల వదలక సత్కర్మమ్ములసదమల సద్భాషణముల సద్దే లేకున్నఇద్ధరలో నాకము కోరిన – భువిపై శాంతిని లేదన్నసాధ్యమా! సంతతముగ సాధన మరచిన ఓ జీవి? పరహితమన్నది…
విలాసమిదియే!
నిద్రహీన నిశివేళల విరిసే చీకటిక్షుద్ర నిర్దయ శీతగాలి నిట బిగిసెను పిడికిలి కాలమేఘ మహా జాలమును పన్నెను ఆకసంజ్వలంత జీవనమారిపోవుననె మానసం శిశిర ఋతు హత భూరుహమ్ముల భాషలు విసురు గత దిన బాష్ప కణముల ఘోషలు ఫాలతలాన కానుపించని చిత్ర,…
పాట పాతదైతేనేమి?
పాట పాతదైతేనేమి?ఆడే నాగులా మనసూగుతున్నప్పుడు! దూరాన్ని క్షణాల్లో కొలిచికాలాన్ని మైళ్ళలోకి మార్చిరాగాల రంగులరాట్నంపైగిరగిరా తిరుగుతున్నప్పుడు మాటరాని మూగదైనారెక్కలొచ్చిన పిట్ట ఒక్కటిరెక్కలార్చిన చప్పుడటుచుక్కలదాకా ధ్వనించినప్పుడు గాలి తాళానికి తలనువూచేదీపశిఖ తాదాత్మ్యతనుఎత్తిచూపే గోడను చూడుఏదో గుర్తుకు రావడంలేదూ! పాట పాతదైతేనేమి?నీ చెవులకు ఆత్మ ఉన్నప్పుడు!!
సంకల్పం
పాఠకులందరికీ అరవై ఐదవ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు సడలనీయదు కడలి, అలల పొంకాన్ని నడినెత్తి సూర్యుడు వడలింపజూసినా అడుగైన కదలదు చూడు, ఆ కొండ పిడుగు బెదిరించినా జడివానకైనా పక్కలో బల్లెమై ‘పాకు’వాడెవడైన మొక్కవోనిస్తామా నిక్కమౌ జాతిని! అరి మర్దన, జనార్దనడు, మురవైరి…
“వాయుసుత” హనుమంతుడు!
నేడు హనుమజ్జయంతి. కావున ఆ మహాభాగవతోత్తముని గురించి యథామతిగా కొన్ని మాటలు… “రామ” అన్న రెండక్షరాలతో ముక్తి కలిగితే, ఆ ముక్తికి మూల హేతువైన భక్తి సిద్ధించాలంటే “హనుమ” అన్న మూడక్షరాలు అత్యవశ్యకం. “హనుమ” అని పలికితే చాలు మూఢమతికి కూడా…
అల లేని సంద్రమంటే
అల లేని సంద్రమంటే – కలలుండే కనుల జంటే కనురెప్పలనే తెరచాపలతో – నీ హృదయమనే దరిదాపునకుఅలా, అలా సాగనీ – ప్రణయ యాత్రనీ నేలకు అందని నెలవంక – నాలోనికి చేరని నీ తలపుగాలికి పరిమళ మందించి – తలవాల్చే…
విహ్వలత
ఒకానొక ఆత్మన్యూనతా శూన్య స్వర్గంలోస్వప్నలోలాక్షి మనోగవాక్షం పైపక్షిలా వాలుతుంది మనసు. దీర్ఘస్మృతుల సచిత్రమాలికలో అక్కడక్కడా చిక్కుకొన్ననిర్గంధ కుసుమాల మృతకళేబరాలతోమర్మభాషణం చేస్తుంది మనసు. వధ్యశిలపై వంచబడ్డ శిరస్సునిస్సహాయ నిగూఢ రోదనలోంచిచటుక్కున్న రాలిపడ్డ బాష్పకణజాలాల్లోఈదులాడుతుంది మనసు. అధో జగతి అనంత జీవన పథ సంచలనాలతోకూడి,…