ఆకాశాన్ని దీవిస్తూ అక్షతలు విడిచిందా పంట చేను పక్షి గుంపులుగా *********** కృష్ణుడే వచ్చి కుచేలునికి మూడు గుప్పిళ్ళిచ్చి అతగాడి సర్వస్వం దోచుకోవడమేనోయే రాజకీయమంటే! *********** నలుగురితో సంఘర్షించిన వేళ చరిత్ర లోకి నేను నడిచాను నాతో నేను సంఘర్షించిన వేళ…