జల్లు

తలపు తడుతూ నేల గంధంతలుపు తీస్తే.. ఆకాశం కప్పుకున్నఅస్థిరమయిన రూపాలుతేలిపోతూ.. కరిగిపోతూ ..అలజడిచేస్తూ..అక్షరాల జల్లు నిలిచే సమయమేది ?పట్టే ఒడుపేది ? పల్లంలో దాగినజ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనోకలిసి తరిద్దామనో.. గుండె నిండేసరికినిర్మలాకాశంవెచ్చగా మెరిసింది.