ఢిల్లీ – తెలుగువారి చైతన్యదేహళి

ఈ యమునాతీరంలో వీచిన సుకవితా సంగీత నాట్య కళాసమీరాలను, ఇక్కడి చరిత్ర విధాతలైన మహనీయ వ్యక్తులను, అసామాన్య సామాన్యులను, స్మరణీయ సంఘటనలను, తెలుగువారు ఉనికికోసం, మనికికోసం ముచ్చటపడి నిర్మించుకొన్న సంస్థలూ సమాఖ్యల చరిత్రలను, ఆ ఆత్మీయతలను, ఆ జ్ఞాపకాల ఛాయాచిత్రాలను, ఉక్తిప్రత్యుక్తులను, సూక్తిరత్నాలను, చిత్రోక్తులను, ఛలోక్తులను, ఆశలను, ఆశయాలను, ఆదర్శాలను మరీ మరీ నెమరువేసుకోవా లనిపించి, స్మృతిసరస్సులో వికసించిన అనుభవ లీలాకమలాల సుగంధాన్ని నాకు పరిచితమైనంతలో శ్రుతపాండిత్య వాక్స్రవంతిగా మిత్రులందరికీ ఒక్కొక్కటిగా పంచిపెట్టా లనిపించి మనస్సంతా మాధుర్యభావంతో నిండిపోతుంది నాకు.

అనుకూల పవనాలా, వ్యతిరేక పవనాలా?

భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పదవీ వియోగం కలిగి పదేళ్ళయ్యింది. మొత్తానికి, నక్కతోక తొక్కినట్లు నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించిన తర్వాత ఆ పార్టీకి బానే కలిసివస్తున్నట్లు కనిపిస్తున్నది. 2002 నాటి గుజరాత్ మతఘర్షణల కళ్ళజోడు తగిలించుకునే చూస్తున్న చాలామందికి…