జీవితంలో…

రేడియో సరిగ్గా పాడడంలేదు…మనిద్దరి మధ్యా గులాబి రంగు మాటలు దొర్లి చాన్నాళ్ళైంది. నువ్వు దేవుణ్ణి అతిగా నమ్ముతావు.కనబడకనే కొట్టుకొనే గుండెలా..నేను టీకప్పులో బుడగల్ని లెక్కపెట్టుకొంటానుచాక్లెట్ రేపర్ విప్పుతోన్నప్పటి పిల్లవాని మనసులా.. కొన్నిసార్లు అన్నీ బాగున్నట్టే వుంటుందిటీవీలో నచ్చిన ప్రోగ్రామ్, మొబైల్లో లేటెస్ట్…

జారిపోయిన నమ్మకం

దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి…

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!

చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.…

అప్పుడప్పుడు…

చిరునవ్వుల పెదవులను తగిలించుకు చీకటి కన్నీళ్ళను గుండె గదిలో భద్రంగా దాచి ఉషోదయంతో పాటు ఉదయిస్తూంటాను. అయినా భావోద్వేగాల వల్లరిలో కొట్టుకు పోతూ అనిశ్చయత చెలియలికట్ట సంయమనాన్ని కోసేసినపుడు పట్టుకోల్పోయిన మనసు వరద వెల్లువవుతుంది కట్టలు తెగిన జీవనదిగా పొంగి పొర్లుతుంది.…

బావిలోని కప్ప వొంటరిది కాదు!

కొండలకు కళ్ళుంటాయ్ గుండె లోయల్లోకి జారిపోయిన వాటిల్నేవో పగలు రాత్రీ వెతుక్కుంటుంటాయ్   నోరున్న మేఘాలు భోరుమంటూంటాయ్ మాటల్ని కురిపిస్తుంటాయ్ మేఘం మాట నేల మీద చిట్లినప్పుడు బద్దలైన రహస్యమొకటి అనామకంగా అడుగులోకి మడుగైపోతుంది   మనసు పోగొట్టుకొన్న నేను గతం…

స్మృతి గీతిక

నిశిరాతిరి ముసిరి మేఘాలు గుసగుసలాడెను కసికసిగా మసిబారెను స్వగతం వేసారెను జీవితం   శిధిల మనమందిర శకలమొక్కటి ప్రొదిలి నేడ్చును ఆది వైభములన్దల్చి విగత పుష్ప వృక్షమొక్కటి పాడు భగ్న తాళానుబద్ధ స్వప్నరాగాన్ని   ఊళలెట్టు గాలి నాలుకల్ చందాన గోలపెట్టు చెట్ల ఆకులందు ఏటవాలుగ…

విలువ లేనితనం!

నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు   ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా!   సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ…

కూలనీ!

యింత ఖుషీ యెప్పుడూ దొర్కలా! యిరగ్గొట్టి, మంటెట్టిం తర్వాత యియ్యాలే తెలిసొచ్చెనా?   నొప్పిలో సుఖముంటదిలేబ్బా! కాంక్రీటు మొండాల్తో యింగా యెన్నాళ్ళు నిలబడ్తార్లే యీ గుండె చాల్దా యేం?   కయిత్వమైనా, కాంక్రీటైనా అరాచకత్వంలోనే వికసిస్తాయి  

అమ్మతనం

తనువుపై మార్పులు చూసి తన్మయం చెంది లోనుంచి శిశువు తన్నుతుంటే తాదాత్మ్యత పొంది మరణ సదృశ్యమైన ప్రసవ వేదన ని బిడ్డని చూడగానే ఆనందగా మార్చి  ఇహ చాలు అని అనకుండా మరో బిడ్డకు తల్లవడానికి అదే ఉత్సాహంతో తన తనువును…

పునర్మిలనం

చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది!   పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు!   అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం…