కృష్ణ శతకం తెలుగు శతక పద్యమాలిక నృసింహకవి 1. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారకానిలయ జనార్ధన కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా 2. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడునీడ నీవే…
Tag: తెలుగు సాహిత్యం
ఉలిక్కిపాటు
రోడ్డుపై తన క్రీనీడ చూసుకొని ఉలిక్కిపడింది వీధి దీపం వేదాంతం పట్టని పట్టణం చీకటిని ఆబగా కావలించుకొంటోంది పుట్టగొడుగు మేడల్లోంచి రాలిపడే మెతుకుల్ని చూసి చచ్చిన బొద్దింక నాలుక చప్పరించింది టీవీలో “అభిరుచి”, పొట్టనిండినోడి “అజీర్తి” అదేపనిగా రమిస్తున్నాయి …
నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!
చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.…
అప్పుడప్పుడు…
చిరునవ్వుల పెదవులను తగిలించుకు చీకటి కన్నీళ్ళను గుండె గదిలో భద్రంగా దాచి ఉషోదయంతో పాటు ఉదయిస్తూంటాను. అయినా భావోద్వేగాల వల్లరిలో కొట్టుకు పోతూ అనిశ్చయత చెలియలికట్ట సంయమనాన్ని కోసేసినపుడు పట్టుకోల్పోయిన మనసు వరద వెల్లువవుతుంది కట్టలు తెగిన జీవనదిగా పొంగి పొర్లుతుంది.…
బావిలోని కప్ప వొంటరిది కాదు!
కొండలకు కళ్ళుంటాయ్ గుండె లోయల్లోకి జారిపోయిన వాటిల్నేవో పగలు రాత్రీ వెతుక్కుంటుంటాయ్ నోరున్న మేఘాలు భోరుమంటూంటాయ్ మాటల్ని కురిపిస్తుంటాయ్ మేఘం మాట నేల మీద చిట్లినప్పుడు బద్దలైన రహస్యమొకటి అనామకంగా అడుగులోకి మడుగైపోతుంది మనసు పోగొట్టుకొన్న నేను గతం…
స్మృతి గీతిక
నిశిరాతిరి ముసిరి మేఘాలు గుసగుసలాడెను కసికసిగా మసిబారెను స్వగతం వేసారెను జీవితం శిధిల మనమందిర శకలమొక్కటి ప్రొదిలి నేడ్చును ఆది వైభములన్దల్చి విగత పుష్ప వృక్షమొక్కటి పాడు భగ్న తాళానుబద్ధ స్వప్నరాగాన్ని ఊళలెట్టు గాలి నాలుకల్ చందాన గోలపెట్టు చెట్ల ఆకులందు ఏటవాలుగ…
విలువ లేనితనం!
నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా! సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ…
అస్తిత్వ వేదన కవులు – 1
ఆవకాయ.కామ్ లో ప్రచురితమవబోతున్న ఈ వ్యాసమాలకు మూలం శ్రీ ఇక్బాల్ చంద్ గారి “ఆధునిక తెలుగు కవిత్వంలో జీవన వేదన” (Exist Aesthesia in Telugu Modern Poetry) నుండి గ్రహించడం జరిగింది. శ్రీ ఇక్బాల్ చంద్ గారు “ఆరోవర్ణం”,…
పునర్మిలనం
చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది! పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు! అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం…