కె సెరా సెరా పాట – మన భానుమతి

"కే సెరా సెరా...." అనే ఒక ఇంగ్లీషు పాట మన తెలుగు సినిమాలో ఉంది తెలుసా?"అత్తగారి కథలు" రచయిత్రి, విదుషీమణి, గాయని, మన తెలుగింటి మణిదీపం, నటీమణి, సకల కళాభినేత్రి శ్రీమతి పి.భానుమతి. ఖంగుమనే ఆమె గొంతులో స్వరాలు వయ్యారాలు పోతాయి. “తోడూ  నీడా” సినిమాలో చిన్నపాపను సముదాయించడానికి ప్రయాసపడే ఇల్లాలి పాత్రలో "శభాష్" అనిపించుకున్నది ఆమె. ఆ క్రమంలో అప్పుడు భానుమతి ఒక ఇంగ్లీష్ సాంగ్ నీ సింగింది "కే సెరా సెరా" అంటూ.

పోతే….!!!

“వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు పల్లదనంబును…..” అంటూ ఏడు వ్యసనాల్ని ఏకరవు పెట్టాడు విదురుడు. “మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః…” అని పద్దెనిమిది వ్యసనాల్ని పట్టీ వేశాడు మనుస్మృతికారుడు. కాలం మారింది, భాష మారింది, మనుషులు పూర్తిగా మారిపోయారు. సంస్కృతం తెలీదు,…

చెదరి జారిన కుంకుమ రేఖలు!

“శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేద”నేది ఒక నానుడిగా మారిన కవి వాక్కు. అలానే ఎటువంటి పదాడంబరం లేకుండా పల్లెవాసుల బ్రతుకు పటాన్ని సున్నితంగా, సునిశితంగా ఆవిష్కరించిన పాట “ఆడుతు, పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది!” పాటకు తగ్గ…