నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే…

నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది..ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి… చుట్టూ కురుస్తున్న వర్షం…. కొండకోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ…