పిచ్చిలో….

నేనో పిచ్చిమొక్కనిరోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా నాలాంటిదే పిచ్చిగాలికొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాదినేనూ ఊగుతా నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేనిచెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది గాలి పిచ్చితోటి నా తలఆ చేతిలో ఊగుతానే ఉంటది