చిరు కోరిక

తూర్పు వికసించికలల పక్షులు ఎగిరిపోయినా ఒక్కో ఉదయం…ఏ పిట్టా పలకరించని చెట్టులానిశ్శబ్దంగా నా పని కొమ్మచుట్టూ ఇంతమందిఆకుల్లా గల గల లాడుతున్నా కదిలించే కిల కిల రావాన్నివెతుకుతూ మనసు అణువణువూ పులకించి పుష్పించాలంటేనీలి మబ్బు వలపు ధారనాకిప్పుడు కావాలి.

వెన్నెల ప్రయాణం

ప్రవహించే కాలంతో ప్రకృతి పాట వెతుక్కుంటూమౌనంగా సాగిపోయేదాన్ని. దేవుడు సృష్టించినరహస్య కొలనులోకలువలా నువ్వు వికసించడం తెలిసాక తామరతూడులాంటి నీ స్పర్శకి నేనో జలపాతాన్నైకోటి ఆశల పూలపడవలతోనీ వైపే ప్రవహిస్తూ … నీ అలల కదలికల మధ్యచంద్రబింబాన్నైనా ఒడిలో నిన్నే చూసుకుంటూ ……

జలపాతం

ఆ జలపాతం ముందు దోసిలి పట్టుకుని ఎంతసేపుగా నిలబడ్డాను? నిండినట్టే నిండితిరిగి తన అస్తిత్వంలోకేఆవిరైపోతూ…కవ్విస్తూ… తడిసిన మనసు సాక్షిగాఅందీ అందని సంతకం కోసంతెల్ల కాగితం విరహించిపోతోంది అలుపెరుగని నృత్యానికి కూడాచలించని ఈ బండరాళ్ళలోకనీ కనిపించని చిరునవ్వేదోదోబూచులాడుతూ…చిక్కుముడి విప్పుతూ. మనిషి కందని రాగంతోసాగిపోతున్న…