పూలమొక్కల నడుమ వనకన్యలా, సంగీతపరికరాల మధ్య సరస్వతి తనయలా, గాత్రంలో గానకోకిలలా….ఇంటిని దిద్దుకోవడంలో సగటు మధ్యతరగతి ఆడపిల్ల మధులత. ఆమెకు వివాహం కుదిరింది. బంగారు బొమ్మైనా బంగారం పెట్టకపోతే కుదరదుగా, అందుకే ఆమెకు పాతిక కాసుల బంగారం,కట్నకానుకలతోపాటు ఆడపడచులాంఛనాలతో సహా…