గమ్యం ఎక్కడో శిఖరాలమీదఉద్భవిస్తుంది,పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగాపెదవి విరుస్తూ.. సామూహిక నిస్సహాయతకుసాక్ష్యమన్నట్టువికటాట్టహాసం చేస్తూ.. వాడి ప్రశ్నల వాలుమీదఆత్మావలోకనమే ప్రయాణం.. ఆ నవ్వులు ముల్లుకర్రలుప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ.. ప్రత్యామ్నాయం దొరికేలోపేమైనపు రెక్కలు కరిగిఆత్మ విమర్శై పలుకరిస్తుంది.