శ్రీలు పొంగిన జీవగడ్డయు-రాయప్రోలు సుబ్బారావు రచన

శ్రీలు పొంగిన జీవగడ్డయు,పాలు పారిన భాగ్యసీమయి,వ్రాలినది ఈ భరతఖండముభక్తి పాడర తమ్ముడావేద శాఖలు పెరిగె నిచ్చట,ఆదికావ్యం బందెనిచ్చట,బాదరాయణ పరమ ఋషులకుపాదు సుమ్మిది చెల్లెలావిపినబంధుర వృక్ఖవాటికనవుపనిషన్మధు నొలికెనిచ్చటవిపులతత్వము విస్తరించినవిమలతలమిదె తమ్ముడాసూత్రయుగముల శుధ్ధవాసనక్షాత్రయుగముల శౌర్యచండిమచిత్రదాస్యముచే చరిత్రలచెరిగిపోయెనె చెల్లెలామేలికిన్నెర మేళవించీరాలు కరగగ రాగమెత్తీపాలతీయని బాలభారతపదము పాడర…