వేంకటేశ్వర (విన్నప) గద్యము

చాణూర మర్ధన! మిమ్ము పేర్కొని పిలిచి మా యింటి లోపల పీటపై పెట్టి ఆవాహనంబు జేసి పూజించుచున్న వాడను. అది ఎట్లన్నచో, సముద్రునికి అర్ఘ్య పాద్య ఆచమనీయంబులు ఇచ్చినయట్లు, మేరుపర్వతమునకు భూషణంబు పెట్టినయట్లు, మలయాచలంబునకు గంధంబు సమర్పించినయట్లు, సూర్యునికి దీపారాధనంబు జేసినయట్లు,…