దుశ్శబ్దపు జాడీల్లో…

జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన “నవవర్ణశాల”లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా…