విలువ లేనితనం!

నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు   ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా!   సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ…