మంచు

చలికాలపు సాయంత్రంఎవ్వరూ లేని బాట మీదఏకాకి నడక. రాలిన ఆకుల కిందఎవరివో గొంతులు ఎక్కడో దూరంగానిశ్శబ్దపు లోతుల్లోకిపక్షి పాట లోయంతా సూర్యుడుబంగారు కిరణాలు పరుస్తున్నాకాసేపటికి ఆవరించే చీకటి మీదకేపదే పదే మనసుపోతోంది కర్రపుల్లల కొసన నర్తించేఎర్రని చలిమంటలోకిప్రవేశించాలనిపిస్తోంది. కురిసే మంచునా గొంతులోఘనీభవిస్తోంది.…