కలవని చూపులు

చూపులు కలిసే లోపే తెరలు దిగిపోతాయి.. వంతెనలు కరిగి పోతాయి.. ఊసులు వెనుతిరిగి వస్తాయి..   మరో ప్రయత్నం మరింత బలంగా.. అసంకల్పితంగా.. మొదలవుతుంది.. తీరం చేరే అలల్లా..   ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?   తలలు తిప్పుకున్న ప్రతిసారీ…

మరో ప్రశ్న

తెరలు తెరలుగాఅవే ప్రశ్నలు.. అలలవుతూమనిద్దరి మధ్య నన్ను శోధిస్తానునిన్ను ప్రశ్నిస్తానుతెలుసుకునే లోపేమరోప్రశ్న ..తెలుసనుకున్న దాన్నితిరిగి ప్రశ్నిస్తూ.. వృత్తంలా పరిచి ఉంచినపట్టాల మధ్య, ఇది,ముడులు విప్పుకుంటూ..గుంటలు పూడ్చుకుంటూ..పరుగనిపిస్తుంది ..మనమధ్య దూరమికలేదనిపిస్తుంది. ఈలోపలనీ అస్థిత్వాన్నీ,నా విశ్వాసాన్నిప్రశ్నిస్తూ.. మరో నెర్ర. అతుకుల చక్రం సాగుతుందిమరో అతుకుని…

అయిష్టంగా..

పలచబడ్డ ప్రస్తుతం మీదవయసునూ అలసటనూ అరగదీస్తూబాల్యాన్ని చేరుకున్నాను పరిసరాలను కమ్మిన సొంత ఊరు,చిన్నతనపు కేరింతల మధ్యనెరిసిన రెప్పకట్టలు తెగికళ్ళనుండి పొంగిన పాత కబుర్లుకాలాన్ని కరిగించిగెలిచామంటూ గేలి చేశాయి అయినా.. అయిష్టంగా..గుండెనిండిన తృప్తికడుపు నిండిన జ్ఞాపకంతోవాస్తవంలోకి తిరుగు ప్రయాణం!

తొలి జాము

నిన్న దాచిన రంగుల చిత్రాన్ని రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది ** మబ్బుల మగ్గాన్ని దూరాన ..మిణుగురు దండు తరుముతోంది ** పక్షి గుంపులు ఆకాశంలోఅక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి ** పొగమంచు తెరలు తీసి ఉదయంచెరువులో రంగు ముఖన్ని చూసుకుంటొంది ** జోడెద్దులు గంటల…