మన సాహిత్యంలో ఉదాహరణము అనునది ఒక లఘుకావ్యం. సంబోధనతో కలిపి ఎనిమిది విభక్తులకూ ఎనిమిది వృత్తాలు రచించాలి. ప్రతి వృత్తానికీ కొసరుగా ఒక కళిక, ఒక ఉత్కళిక అను రగడ భేదాలు జతపరచాలి. ఇదీ స్థూలంగా దీని రూపం. ఇది కేవలం దైవస్తుతికోసం అవతరించిన కావ్యభేదం. వృత్తాలైతేనేమి, కళికోత్కళికలైతేనేమి అన్నీ వెరసి పాతిక పద్యాలు. ఇంకా ఏవేవో నియమాలు లాక్షణికులు చెప్పేరు కానీ కవులందరూ పాటించినవి ఇంతమాత్రమే. మన శరీరంలోని ఉన్న జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, తన్మాత్రలు ఐదు. ఇలా మన వేదాంతులు చెప్పినవి కూడుకుంటూ వెళితే పాతిక విలువ ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ మన శరీరంలో మనతోపాటూ ఉన్నవే. అన్నిటినీ భగవదర్పణ చెయ్యడం ఉదాహరణ కావ్యంలోని పరమార్ధం.
Tag: devotional songs
భామినులార! సరగున రండీ!
పరుగిడి, వడివడి, వేగమె రండీ ఏ మాత్రము జాప్యమును సేయకనూ; భామినులార! సరగున రండీ! సత్వరమే తామెల్లరునూ పరుగిడి, వడివడి, వేగమె రండీ! || తులసీ మాలలు అల్లుదము కళకళలాడును హరిత వర్ణముల జలజనాభునీ గళమున…