నిద్రితులు

కలలు విప్పుకుంటూ… కళ్ళు తెరుస్తూ… సిగ్గొదిలేసిన చీకటి వస్త్రాలన్నీ విసర్జించింది.   వెలుగు తెర మీద అందరూ నాలాగే రహస్య నిద్రలో నగ్నంగా… మరింత విస్మయంగా!   వెంటాడే వెలుతురు చినుకులమధ్య ఆవలితీరానికి పరుగులిడుతూ ఒంటరి ఆత్మల సమూహాలు!   ఆకులన్నీ…

లోకం కోసం…

పండు ముదుసలి వగ్గులా ముడతలు పడ్డ దేహంతో ఆ చెట్టు   ఆకలేసిన కాకిలా ఆరో ఋతువు ఆకులన్నీ అద్దుకు తినేసింది   ఆకతాయిలకి అరవై చేతులతో వడ్డించిన ఆ చేతులు ఇప్పుడు బోసిపోతూ..   లేదనే మాటే తెలీని చెట్టు…