మొన్నటి వాన సాయంకాలపుఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి! అనుభవాల అల్మరాఅప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లాఎండిన మొగలిరేకులుగరుకుగా తగుల్తూనే గుబాళిస్తాయి.. కాలం క్రమబద్దంగా ఎండగట్టిన గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండోఆత్మీయపు వేసవివానఆసాంతం కురిసి పోతుంది.. ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే…