బ్యాక్ డ్రాప్: గుండీలు తీసిన బంటైన జైలు వార్డెను గారు హడావుడైపోతున్నారు. బొడ్డుకిందకు జారిన బెల్టును, ప్యాంటుతో బాటు పైకిలాక్కొంటూనే హడావుడైపోతున్నారు. దొరగారు హైరానా పడితే కాల్మొక్త బాంచెన్లు తాపీగా కూర్చోగలరా? గలలేరు కాబట్టే అసిస్టెంటు వార్డెను నుండి కసువునూడ్చే తిమ్మమ్మదాకా…