వింత సృష్టి

 మనసులేని విజ్ఞానం  నలుమూలలా విజ్ఞానులను పోగుచేసి    ఓ వింత సృష్టి చేయమందట    కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లే    ఇకపై పుట్టే ప్రతి శిశువు    లాప్టాపులతో బుక్స్ బాగులతో పుట్టాలని   క్యార్ క్యార్ మనకుండా సర్ మేడం…

సున్నాలు – శూన్యాలు

సున్నాలు – శూన్యాలు  సున్నాలతో ఎదిగేది జీతం.  శూన్యాలతో నిండేది  జీవితం.    *** వెన్నెల విల్లు చూపుల విరాళమిచ్చిన! నాకు  వెన్నెల విల్లు రాసిచ్చింది  ఆ జాబిలి.  *** ఇంట…. రచ్చ… విభజించి పాలిస్తూ రచ్చ గెలిచి  కలిసుంటే కలదు…

విశ్వ పరిణామం

విశ్వ పరిణామం   అణువు నుండి తానెలా పరిణమించానో అని  తెలుసుకోవాలంటే ఈ విశ్వం  నాలోని నీ పరిచయం నుండి  ప్రస్తుతాన్ని పరీక్షిస్తే సరి.    **** సంస్కృతి   వ్యసనాలకు వయసు తగ్గిన చోట  తాను మాత్రమూ ఆయువెక్కువ పోసుకోగలదా?…

జాబిలి – కలువ

జాబిలి -కలువ నీ చెక్కిలిపై విలాసంగా నవ్వుతున్న నన్ను నేను చూడకనే కలువలై విచ్చిన నీదు కన్నుల జూచి! ఎక్కడా? ఆ నిండు జాబిలని వెతికాను. ******* కొంటె కోణంగి కవ్వించి, కవ్వించి నింగి వెలుగులను దాచేసే ఆ కొంటె కోణంగేనా!…

విరుల ఆనందబాష్పాలు

విరుల ఆనందబాష్పాలు  నిండు జాబిలే దిగొచ్చి    వెన్నెల బొట్టెట్టి తన ఇంటి పేరంటానికి    తమనాహ్వానించిందంటూ ఆ పూబాలలన్నీ,   తమ పై వాలిన మిణుగురులతో కల్లలాడువేళ!   కలలో నుండి  మేలుకున్న నాపై !   నవ్వుతూ అన్నైతే…

కష్టార్జితపు మత్తు

కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో  ఆతని కష్టార్జితపు మత్తు  చమురు పోస్తుంది.  ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున  ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి   నీ చూపులు.  ******** అనుభూతులు…

ఏటిపాట

  ఏటిపాట  కోయిల గొంతు మూగవోయిందని తన గళమెత్తి ఎలా పాడుతోందో చూడా ఏరు ఈ వనాన.    ********మెరుపుకొరడా   మెరుపు కొరడా ఝుళిపిస్తే ఇన్ని చెమటలు పోసాయా?ఆ ఆకాశానికి!   ********ముత్యాలహారం   ఒంపు తిరిగిన ప్రతి చోట ఆ గోదారికో ముత్యాలహారమేయడానికని ఎన్ని ముత్యాలను…

అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి అలుపెరుగని బాటసారి కదా!అని,నా ఇంట ఓ సారి విడిది చేసి పొమ్మన్నాను.పోతూ పోతూ నాదాన్ని! నినాదాన్నినా ఇంటి, ఒంటి పేర్లుగా మార్చిపోయిందీ గాలంటూమనసులకు హత్తుకునేలా ఎంత మధురంగా చెబుతోందోఆ వేణువు. ************* పచ్చికదీపాలు ప్రభాతకిరణాలకు దారి చూపించాలనితలకు మించిన…

మనోహర రహస్యం

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> ఎవరు మీటుతున్నారు మిమ్మల్ని ఇన్ని శృతులను మాకై వినిపిస్తున్నారు    ఎవరు నేర్పుతున్నారు మీకు  మీలో మీరు కలసి ఇన్ని వగలను మాకై ఒలకబోస్తున్నారు  తనకు తెలుసేమో! నని ఆ నింగిని నేనడిగితే  నాకేమీ తెలీదంటూ…

మరుభూమి

మరుభూమి   ఇంతింత దూరం పరిగెత్తుకొచ్చేసి   ఆఖరికి అందరూ చేరే చోటు కోసం   వెతుక్కుంటోందోయ్   ఊరు.   **********   బీడు   ఈసురోమంటూ   అందవిహీనంగా కూర్చున్న తనను   పలకరించే నేస్తమై! నాగలి వచ్చేసరికి…