రైతు

గుప్పెడిచ్చే ఆ రైతు పిడికెడౌతున్నాడు.    ***** వేళ్ళా రైతువి ముడి పడ్డాయని తెలియక వాడి డెక్కల చప్పుడుతో తను డొక్క నింపుకోవాలని ఎదురు చూస్తోందా చేను.    ****** అందరికీ నవ్వులే నగలు కానీ ఆ నవ్వులే బంగారం కన్నా ప్రియమైనాయి. …

భారం

ఎవరికీ తెలియకూడదని వదిలించుకున్న తొమ్మిది నెలల భారమదని పాపమా కుక్కలకేం తెలుసు అందరికీ తెలిసేలా పంచేసుకున్నాయి మరి.      ******* ఉన్నోడు స్వర్గంలో కూర్చుని తాగుతాడులేనోడుతాగి స్వర్గానికెళ్తాడుమొత్తానికి స్వర్గమొచ్చివీధి వీధినా పడిందోయ్.      ******* ఆ సాలెకు గూడుచేసిన సాయంఈ…

మౌనం

మౌనం మౌనం కలసి ఎలా మాట్లాడుకుంటాయంటే రెండు గుండెల చప్పుళ్ళను నెమ్మదించి నాలుగు రెప్పల సవ్వడిలా. ******** నా అనంత లోకపు ఎల్లలు నీ కనుసన్నలు.  ******** బరువెక్కిన తనను మోసుకుపోతున్న గాలిని తన తడి చేతులతో హత్తుకుంటూ కరిగిపోయిందా కారుమేఘం.…

మొగ్గ

మొగ్గొకటి సుఖించిందని పచ్చోసనతో చెబుతుందా చెత్తకుండీ.       ******* పుడమికి చీర నేసే వాడికీ పడతికి చీర నేసే వీడికీ బ్రతికే దారే మూసుకుపోయింది.        ******* పాడుతూ తన లోతు తెలుసుకునే రాయొకటి తన ఇంటికొచ్చిందని ఎంతందంగా ఆడుతోందో చూడా…

అంతర్వాహిని

అనురాగపు అంతర్వాహినులను ఇముడ్చుకున్న ఎడారులు ఆశ్రమాన ఆ వృద్ధుల మోములు.        ******** జీవితాలను తూర్పారబెడితే గుప్పెడైనా అనుభూతుల గింజలు రాలతాయా ఈ రోజుల్లో. ******* లోకమంతా మెచ్చే నేతగాడే గానీ వాడు నేసిన చీరను అమ్మడం చేతకాక తెల్లవారకుండానే మడత…

గతం

గతం లోకి నే చేసిన రంధ్రాన్వేషణ నా భవిష్య దారుల వెంట నా లోతు గోతులు తవ్వింది.          ******* భానుడే వచ్చి కోప్పడినా తెల్లారలేదని బదులిచ్చే ఎన్నో జీవితాలు  మత్తులో పడి  కొట్టుకుంటున్నాయి   ఆ పబ్బుల్లో పడి.        *********…

సంకల్పం

తనంతటి ఆ విత్తు సంకల్పానికి చినుకంత సహకారమిస్తుంది ఆ ఆకాశం.           ****** ఎత్తు పల్లాలను ఒకే సారి చూస్తూ కూడా నిలబడిందా ఆ మహావృక్షం ఎన్నో జీవితపాఠాలను నీకు చెప్పడానికి.         ******* నిలకడ నేర్పాలని నేననుకుంటే నాకే ఒయ్యారం నేర్పిందా…

చరమగీతం

పుడమి గుండె కరిగేలా తన చరమగీతాన్ని ఎంతందంగా పాడుతుంది ఆ వాన చినుకు.     ******* అపుడు రాయి రాయి రాపిడిలో  పుట్టిన నిప్పు ఇపుడు మనిషి మనిషి ఎదురైతేనే………      ******* అద్దం లాగే మనసూ పగిలితే ఒక్క రూపాన్నే లెక్కకు మించినన్ని సార్లు చూడాల్సి వస్తుంది.     ********