మరుభూమి

మరుభూమి   ఇంతింత దూరం పరిగెత్తుకొచ్చేసి   ఆఖరికి అందరూ చేరే చోటు కోసం   వెతుక్కుంటోందోయ్   ఊరు.   **********   బీడు   ఈసురోమంటూ   అందవిహీనంగా కూర్చున్న తనను   పలకరించే నేస్తమై! నాగలి వచ్చేసరికి…

మరణం

మరణం నిజంగా మరణం  నీ సమస్తేంద్రియాలను ఒప్పచేప్పేసేంత మంచి కలేమిటోయ్. ******* టోల్ గేట్ మేఘాలకు  టోల్ గేట్ ఆ కొండ. ****** కాలం పోటీ పడే అవకాశం ఎవరికిచ్చింది గనుక ఆ కాలం ఓడింది గెలిచింది అనడానికి. ****** మెరుపు…

కూడికలు తీసివేతలు

ఎన్ని భావాలనైనా మోయడానికి పుష్పకమేమీ కాదోయ్ నా మనసు! కూడికలు తీసివేతలు నేర్పే చిన్న బడిలోని నల్లబల్ల అందుకే ఒకటి చెరిగితే గానీ ఇంకొకటి దాని మీదకి రాదు మరి నిజానికి కూడికలు తీసివేతలు అనే ఈ రెంటి నడుమ నిత్యం జరిగే సంఘర్షణలో…

మొగ్గ

మొగ్గొకటి సుఖించిందని పచ్చోసనతో చెబుతుందా చెత్తకుండీ.       ******* పుడమికి చీర నేసే వాడికీ పడతికి చీర నేసే వీడికీ బ్రతికే దారే మూసుకుపోయింది.        ******* పాడుతూ తన లోతు తెలుసుకునే రాయొకటి తన ఇంటికొచ్చిందని ఎంతందంగా ఆడుతోందో చూడా…

సంకల్పం

తనంతటి ఆ విత్తు సంకల్పానికి చినుకంత సహకారమిస్తుంది ఆ ఆకాశం.           ****** ఎత్తు పల్లాలను ఒకే సారి చూస్తూ కూడా నిలబడిందా ఆ మహావృక్షం ఎన్నో జీవితపాఠాలను నీకు చెప్పడానికి.         ******* నిలకడ నేర్పాలని నేననుకుంటే నాకే ఒయ్యారం నేర్పిందా…