వెలుగుల చీకట్లు

 వెలుగుల చీకట్లు నా దేశాన సంస్కృతనే గర్భాలయాన  రంగురంగు దీపాలే! ఎన్ని చీకట్లను ప్రసవించాయో చూడు! ఆ పబ్బుల పుణ్యమా అంటూ.    **** వెచ్చని స్వప్నాలు   మబ్బుల దుప్పటి కప్పుకుని నిదురించే  ఆ కొండల మనస్సుల్లో  వెచ్చని స్వప్నాలుగా…

నా మనసు

లోకాన్ని ఓ వైపుకు, నన్నోవైపుకు నెట్టేస్తూ బలవంతానా ఓ విభజన రేఖను గీసిందెందుకో నా మనసు పోనీ! లోకం వైపు ఓ అడుగేద్దాం, దాని అంతరంగాన్ని చదివేద్దాం అనుకుంటే  నీదే నిజమంటూ ఎక్కడలేని రాజసాన్ని నాకాపాదిస్తుంది నా కనుసన్నల్లో మెలగాల్సిన కన్నెపిల్ల ఈ…

మన్నిక

 రైతు  బహుశా నేల విడిచి సాము చేయడం నేర్చుకున్నాడేమో నీ రైతు అందుకే దూలానికి వేలాడుతూ అలా ఊగుతున్నాడు అంటోంది గట్టున చెట్టు ఆ చేనుతో.  **********మన్నిక నా కలలన్నీ పగిలాయి కానీ మా వాడు కొన్న ఈ జోడు మాత్రం ఊహు, వాడంతే మన్నికకు ప్రాణం ఇస్తాడంటూ రెండు…

ఉదయ వాహ్యాళి

లేలేత వలపుల తొలికిరణాల పలకరింపులలో  పై సొగసులనే దాచిన! పైటన ఈ సీమ అందాలు చూస్తుంటే  నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది  ఒదిగి కూర్చున్న స్వేచ్ఛ రెక్క సాచి   సంధ్యకై హారతి పడుతున్న చిత్రాలవిగో  సద్దుమణిగిన నిన్నటి…

ఓ దీపమా!

 వెలుగుతో ఓ సంద్రాన్ని సృజియించి  అందు ముత్యమై మెరిసేవు నీవు!అలలేవని ఎవ్వరడిగేరు నిన్ను గాలి కూయలలూగేవు నీవు విత్తుకున్నది ఆదిగా! ప్రతి పుటలోనూ, కాంతి పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ నా మనసో వాసంత వాచకాన్ని చదువుతుంది నా కనుపాపలింట నీ వెల్గు…

పసిపాప

పసిపాప ఊగే ఊయల ఆగిపోయిందని మేలుకున్న పసిపాప నా స్వప్నం.   ****** పాదుక మీదెక్కి నాడు మీద పడుతూ నేడు పాలనకు ప్రతీక అయింది ఆ పాదుక.   ****** రక్తదానం జలగలూ రక్తదానం చేస్తాయోయ్ పంచవత్సర వసంతోత్సవాన.   ********…

వర్ణాశ్రువులు

బాల్యాన ముగ్గురు తాతలు చేయిపట్టి సౌందర్య వనాంతరాల కుసుమరాగరంజిత పదాన నన్ను నడిపించారోయ్! ఆపై రూపరేఖా లావణ్యాలతో విచ్చుకున్న నా యవ్వన సోయగాన్ని రసికదిగ్గజాలైన ఆ ఎనమండుగురు ఎంతందంగా వర్ణించారోయ్! భువనైకమోహన హాసవిలాసాన. ఇక నా కౌమార కౌశలాన రవి అస్తమయమే ఎరుగమన్న…