ఎక్కడికో…

ఇవాళైనా ఏమైనా చెప్తావని ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి నిల్చుంటాను మలుపులు తిరుగుతూ ఏ మార్మికతల్లోకో మౌనంగా వెళ్ళిపోతావు కదిలే ప్రవాహంలో కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా “నేను” మిగిలిపోతాను!

అలజడికి అటువైపు

1. అలజడిరైలు ప్రయాణంచీకట్లో ఏ సొరంగాన్ని దాటుతున్నావంతెనపై ఏ ప్రవాహాన్ని దాటుతున్నాఎదురౌతున్న మరో రైలును దాటుతున్నా అదే అలజడి! 2. అటువైపుసీతాకోక ఎగురుకుంటూకట్లపాము పాక్కుంటూకప్ప గెంతుకుంటూరోడ్డు దాటేసాయి. నేనెప్పుడో..!

ఈ క్షణం

రాత్రి అనంతంగా పరుచుకుంది కొవ్వొత్తి సగం కరిగిపోయింది ఆలోచనలెందుకు నిలిచేది ఏముందని? కొవ్వొత్తి వెలుగులో అందమైన ఆమె ముఖం అందుకో… కొవ్వొత్తిని ఆర్పేసి ఈ క్షణాన్ని వెలిగించు!

నూతి మీద మూడు కవితలు

1. మధ్యాహ్నపు మండుటెండలో పల్లెటూరి నేల నూతిలో నిశ్చలంగా నీరు నిలకడగా ఆకాశం నీటి తపస్సుని చేద భగ్నం చేయగానే ఎంత అలజడి! కోపంతో నుయ్యి ఏ ప్రతిబింబాన్నీ చూపించడం మానేసింది 2. నూతిని వీడలేని నీటి చుక్కలు కొన్ని చేదలోంచి…